పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐ వి రమణారెడ్డికి ఘన సన్మానం

పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐ వి రమణారెడ్డికి ఘన సన్మానం

దర్శి అక్టోబరు 16 (న్యూస్ మేట్) : 16/10/20దర్శి మండలం వీరయపాలెం పంచాయతీ సెక్రటరీ గా పనిచేస్తున్న ఎడమ కంటి వెంకటరమణా రెడ్డి ని పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలోశుక్రవారం ఘనంగా సన్మానించారు..ఎంపిడిఓ హాజరై ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి పదవతరగతి ముండ్లమూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివి 2000 సంవత్సరంలో మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు .ఆర్థిక ఇబ్బందులు రీత్యా చదువు ఆపేశారు .2009లో ఓపెన్ డిగ్రీ మరియు ఎంఏ హిస్టరీ పూర్తి చేశారు .2013లో ఏపీపీఎస్సీ గ్రూప్3 ద్వారాజిల్లాలో ఓపెన్ కేటగిరిలో 37 వ ర్యాంకు సంపాదించి 2014 లోపెద్ద వుయ్యాల వాడ పంచాయతీ కార్యదర్శి గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.2018 లో గ్రేడ్3 పంచాయతీ కార్యదర్శి గా పదోన్నతి పొందారు .ఉద్యోగ బాధ్యతలతో పాటు అణగారిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద అనాధ పిల్లలకి చైల్డ్ హెల్ప్ లైన్ సహకారంతో ఒంగోలు బొమ్మరిల్లు ఆర్ఫన్ హోమ్ లో చేర్పించి ఇప్పటికి పది మంది వరకూ విద్యార్థులకు విద్యా దానం చేశారు అని ఆయన అన్నారు. ముండ్లమూరు ఏపీ మోడల్ హై స్కూల్ లో పదవ తరగతి జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అద్దంకి రోడ్ లోనికనకదుర్గమ్మ గుడి వద్ద నివాసముండే సంచారజాతుల వారు కోవిడ్19 వలన ఉపాధి కోల్పోయిన ఇరవై ఐదు కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం చొప్పున నిత్యావసరాలు పంపిణీ చేశారు .రమణా రెడ్డి వారి పిల్లల పుట్టిన రోజులు కూడా అనాధ పిల్లల మధ్య జరుపుకోవడం వారి యొక్క సేవానిరతి కి నిదర్శనం అని ప్రజా సంఘాల వారు కొనియాడారు .ఈ కార్యక్రమంలో బిసి సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు వెంకటేశ్వర్లు ,రాష్ట్ర దలిత సేన అధ్యక్షులు కె. మార్క్, ప్రధాన కార్యదర్శి ప్రేమకుమార్, ఏఎన్జిఆర్యు టైమ్ స్కేల్ ఎంప్లాయిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు, ఎస్సి ఎస్టి బిసి ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం బ్రహ్మయ్య, వికలాంగుల సంఘం అధ్యక్షులు పూసల ఓబయ్య ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *