అంజయ్య భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు కాదు
కందుకూరు అక్టోబరు 16 (న్యూస్ మేట్) : బహుజన హక్కులకై నిరంతరం పోరాడుతున్న “భీమ్ ఆర్మీ “రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించుకున్న ఇస్తర్ల అంజయ్య ను ఎవరూ రాష్ట్ర అధ్యక్షులు గా నియమించలేదని భీమ్ ఆర్మీ ప్రకాశంజిల్లా అధ్యక్షులు కసుకుర్తి మాల్యాద్రి ఒక ప్రకటనలో తెలిపారు.భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ ఆజాద్, జాతీయాధ్యక్షులు వినయ్ రతన్ సింగ్ లు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులను నియమించలేదని తెలిపారు. 2019 నుంచి మే నెల నుంచి ఇక్కడ భీమ్ ఆర్మీ కార్యకలాపాలు ప్రారంభం కాగా, ఇప్పటి వరకు ఏ కార్యక్రమంలో పాల్గొనని అంజయ్య తాను రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించుకొని తన ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదన్నారు. గతంలో ఒక స్వచ్చంద సేవా సంస్థలో పనిచేస్తూ ఉమ్మడి రాష్ట్రంలోని మాల, మాదిగ కులాల మధ్య చిచ్చు పెట్టి ఎందరో ఉద్యోగాలు ఊడిపోవడానికి కారకులైన అంజయ్య బహుజనులను ఎలా ఐక్యత చేయగలరని ఆయన ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలో కొన్ని జిల్లాలలో గతంలో తనతో పాటు స్వచ్ఛంధ సంస్థలో పనిచేసిన వారిని మాత్రమే సంప్రదించి భీమ్ ఆర్మీ ని బలహీన పరచే చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.వ్యక్తి ప్రతిష్ట కోసం పరితపిస్తున్న అంజయ్య తన చర్యలు మానుకోకుంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. కందుకూరు ప్రాంతానికి వచ్చిన అంజయ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి కనీస సమాచారం ఇవ్వకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించి భీమ్ ఆర్మీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాడని ఆయన ఆరోపించారు. బహుజన స్ఫూర్తిని దెబ్బతీస్తే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాల్యాద్రి హెచ్చరించారు. అంజయ్య పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తమ ప్రకటనలో స్పష్టం చేశారు.. అంజయ్య తప్పుడు ప్రకటనలు బహుజనులు నమ్మరాదని ఆయన వెల్లడించారు.