జీఓ నెంబర్ 22 ను నిలుపుదల చేయాలి రావుల వెంకయ్య

జీఓ నెంబర్ 22 ను నిలుపుదల చేయాలి రావుల వెంకయ్య
త్రిపురాంతకం అక్టోబర్ 16 (న్యూస్ మేట్) : 16/10/20జీఓ నెంబర్22ను నిలుపుదల చేయాలని ఆలిండియా కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం త్రిపురాంతకం స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసందర్భంగా వెంకయ్య మాట్లాడుతూఈ పథకం దివంగతినేత రామారావు ప్రవేశపెట్టి రద్దు చేశారు. అనంతరంచంద్ర బాబు పరిపాలన ప్రవేశ పెట్టగా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చిదని అన్నారు. అప్పట్లో జరిగిన ఘర్షణలో ముగ్గురు నాయకులుమృతి చెందారు దానితో ప్రభుత్వం పధకమును ఉపసంహరించుకున్నారు.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బాగా ప్రారంభించారు.ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆయన రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఉంటే శోభిస్తుందన్నారు.ఈపధకం ఎందుకు ప్రారంభించాలి ఎందుకు రైతుల ఖాతాలలో జమ చేయాలని ఆయన ప్రశ్నించారు.మోడీకి లోబడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని,రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.అన్ని ప్రభుత్వాలు అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు .ప్రతి మనిషిపై 40 వేల రూపాయలు భారం పడిందని ఆయన అన్నారు.ఇప్పుడు ఉన్న పరిస్థితులలో డీజిల్ పెట్రోల్,మద్యంతో ఎక్కువబారం పడిందన్నారు.ఉద్యోగులకు జీతాలు,పించన్లు సక్రమంగా ఇవ్వడంలేదని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వడ్డీరాయితీ ఇప్పటివరకు ఎవరి ఖాతాలో జమకాలేదన్నారు.రాష్ట్రవ్యాప్తగా 2000 కోట్ల రూపాయలు నిలబడిపోయాయన్నారు.స్మార్ట్ మీటర్లు బిగించడానికి 2వేల కోట్లు ఖర్చుఅవుతున్నాయన్నారు.గడువు తేదీలలో రైతులు విద్యుత్ బిల్లు చెలించకపోతే విద్యుత్ నిలిచిపోతుందన్నారు.దేశంమొత్తం 11 రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకించాయని ఆయన అన్నారు.రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం తనయుడు జగన్మోహన్ రెడ్డి నీరుకార్చడం ఏమిటని ప్రశ్నించారు.రైతులకు విద్యుత్ అందించడంలో అంతరాయం కలిగిస్తే బాగుపడ్డ ప్రభుత్వాలు లేవన్నారు.ఉచిత విద్యుత్ జీవో ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తీవ్రస్థాయికి చేరుతుందని ఆయన అన్నారు.రైతులు పంటను ఇతరప్రదేశాలకు అమ్మడం వలన గిట్టుబాదు ధర లభించిందని అన్నారు.86 శాతం సన్నకారు రైతులు ఉన్నారని ఆయన అన్నారు.ఈపదకం దళారులకు,పెద్దరైతులకు ఉపయోగపడే పదకమని ఆయన అన్నారు.దేశంలో ఉన్న అన్నీ రైతు సంఘాలు ఈరైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.ఆంద్రప్రదేశ్ రైతుసంఘంకార్యదర్శి మల్నీడి. యలమందరావు,ఆంధ్ర ప్రదేశ్ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు డి. శ్రీనివాస్,సీపీఐ మండల కార్యదర్శిబాణాల రామయ్య,నాగేశ్వరరావు, చెన్నకేసవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *