రోటరీ సేవలు విస్తృతం చేస్తాము డిస్ట్రిక్ట్ గవర్నర్
ఎన్.వి. హనుమంతరెడ్డి*
సింగరాయకొండ అక్టోబర్ 16 (న్యూస్ మేట్) : శుక్రవారం రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ Rtn హనుమంతరెడ్డి అధికారిక పర్యటనలో భాగంగా సింగరాయకొండ రోటరీ క్లబ్ ను సందర్శించారు. మూలగుంటపాడు పంచాయతీ వెంకటేశ్వర కాలనీ లో మహిళకు కుట్టు మిషన్ ఇచ్చారు. అదేవిదంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటిన పిదప రైల్వే రోడ్డులో ఉంటున్న నిస్సహాయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి (ఒంగోలు పార్లమెంట్ వైద్య విభాగం అధ్యక్షులు) పాల్గొని రోటరీ క్లబ్ ద్వారా సింగరాయకొండలో చేయదగిన సేవాకార్యక్రమాలు గురించి చర్చించారు.రోటరీ అధ్యక్షులు మాలె రంగారెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో రోటరీ సేవలు విస్తృతం చేస్తామన్నారు.కార్యక్రమంలో కార్యదర్శి పంతగాని వెంకటేశ్వర్లు,అసిస్టెంట్ గవర్నర్ రామకృష్ణారెడ్డి,డిస్ట్రిక్ట్ సెక్రటరీ సింగారావు, జెట్టి సూర్యచంద్ర శేఖర రెడ్డి, నాగసూరి వెంకట సుబ్బారావు,మర్రిపూడి రత్తయ్య, అబ్దుల్ సుభాని తదితరులు పాల్గొన్నారు.