హేచరీల పై విజిలెన్స్&ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీలు.

హేచరీల పై విజిలెన్స్&ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీలు.
ఉలవపాడు అక్టోబర్ 16 (న్యూస్ మేట్) : 16/10/20ఉలవపాడు మండలం. కరేడు పంచాయతీ పరిధిలోని బట్టిసోమయ్య పాలెం దగ్గర ఉన్న 9 ఆక్వా హేచరీల పై శుక్రవారం విజిలెన్స్&ఎన్ ఫోర్స్ మెంట్ అడిషనల్ ఎస్ పీ సుబ్బారెడ్డి ఆధ్వర్యములో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సంధ్య మరియు మంజునాధ హేచరీలను పరిశీలించారు. ఈ సందర్భముగా అడిషనల్ ఎస్ పి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేర హేచరీల నిర్మాణాలు జరిగాయా, లేదా పంచాయతీ అనుమతులు ఎలా ఇచ్చారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సక్రమముగా చెల్లిస్తున్నారా లేదా,నిర్మాణాలకు తీసుకున్న స్థలం, భవన ఏర్పాటు జరిగిన స్థలాల కొలతల విషయములో ఏమైనా తేడాలున్నాయా, అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజు రెండు హేచరీల సంబంధించిన కొలతలు సేకరించారు. ఇదే విధముగా తొమ్మిది హేచరీలలో తనిఖీలు చేపట్ట నున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా ప్రణాళిక అధికారి గురవారెడ్డి, విజిలెన్స్&ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ బిటి నాయక్,అసిస్టెంట్ ఇంజనీర్లు చిరంజీవి, సంతోష్ రెడ్డి,ఈఓఆర్డీ చెంచులక్ష్మి, కరేడు పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి,సచివాలయ సర్వేర్లు,సిబ్బంది తదిదరులు పాల్గున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *