పోలీస్ మెన్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్

పోలీస్ మెన్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్

ఒంగోలు అక్టోబర్ 16 (న్యూస్ మేట్) : పోలీసులు16/10/20 సమర్థవంతంగా పని చేయాలంటే వారికి ఉన్న సమస్యలు ముందుగా పరిష్కరించుకోవాలని అప్పుడే విధినిర్వహణలో మెలకువతో పని చేయగలుగుతారని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. ఆయన శుక్రవారం పోలీస్ మెన్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో కచ్చితత్వంతో పని చేయాలంటే పోలీసులు మానసికంగా సమస్యలు లేకుండా ఉండాలని ఆయన అన్నారు .పోలీసులు వారి సమస్యలు పరిష్కరించు కోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవల అందించగలుగుతారు అని ఆయన తెలిపారు .పోలీసుల సమస్యల పరిష్కారం కోసం తాను ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. పోలీసుల సమస్యలు తన దృష్టికి తీసుకు రావటం లో అలసత్వం అవసరం లేదని నేరుగా తనకు తెలియజేయాలని ఆయన సూచించారు. కరోనా లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు అందించిన సేవలను ఆయన కొనియాడారు .పోలీసులు సమర్థవంతంగా పని చేసినప్పుడు సమాజంలో చెడు కనిపించదని ఆయన అన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *