ఆహార వృథాను అరికడుదాం పేదల ఆకలి కడుపులు నింపుదాం ఐసిడిఎస్ సూపర్వైజర్

ఆహార వృథాను అరికడుదాం పేదల ఆకలి కడుపులు నింపుదాం ఐసిడిఎస్ సూపర్వైజర్16/10/20
కనిగిరి అక్టోబర్ 16 ( న్యూస్ మేట్) : నిరుపేదలు ఆకలి కడుపుతో రోజులు గడుపుతున్నారని ఫుడ్ వేస్టేజీని అరికట్టి అందరి కడుపులు నింపడం మనందరి సామాజిక బాధ్యత అని ఐ.సి. డి.ఎస్ సూపర్ వైజర్ యం.వి. ఎస్ పార్వతి అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని కనిగిరి లో మహిళ అభివృధి,శిశు సంక్షేమ శాఖ మరియు గుడ్ హెల్ప్ సంస్థ ఆద్వర్యంలో ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ వి.మాధవి అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వృథాను అరికడుదాం.. నిరుపేదల కడుపు నింపుదాం.. అని కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై అవగాహన కాస్తైనా పెరిగిందని పోషకాహారాన్ని తీసుకోవాల్సిన ప్రాధాన్యతను అది నొక్కి చెబుతున్నదని అయితే అందరికీ మూడు పూటలా ఆహారం లభించడం లేదని మన కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో నేడు మనం జరుపుకుంటున్న ప్రపంచ ఆహార దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రతి ఏడాది అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం ని జరుపుకుంటాము. యునైటైడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎవో) దీనిని 1979 లో గుర్తించింది. అప్పట్నుంచి దీనిని ప్రతి యేటా ఈ రోజును ఒక థీమ్ తో జరుపుకుంటుండగా.. ఈ ఏడాది.. అందరం కలిసి ఆహార పదార్థాలను పెంచుదాం.. భవిష్యత్తుకు భరోసానిద్దాం అని వచ్చే విధంగా రూపొందించారని అందులో బాగంగా ప్రతి అంగన్ వాడి కేంద్రం లో పెరటి తోటలు పెంచుతున్నామని అన్నారు. పార లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ సంస్థ కార్యదర్శి మండ్రు రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజలందరికి పోషకాహారం కల్పించాలనే మహా సంకల్పంతో ఐక్యరాజ్యసమితి ముందుకెళ్తుందని ప్రపంచంలోని పేద మరియు బలహీన వర్గాలపై దృష్టి సారించి వారికి ఆహార భద్రత కల్పించడమే గాక అందరికీ పోషకాహారం కోసం అవసరమైన చర్యలను చేపట్టడానికి అనేక అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థ ల సహకారంతో గుడ్ హెల్ప్ సంస్థ ఆద్వర్యంలో చేపట్టనున్నారని తెలిపారు. ప్రోజెక్ట్ అసిస్టేంట్ గంధం సామ్యేల్ గెర్షోమ మాట్లాడుతూ పోషకాహార లోపం, ఆహార భద్రత లేని వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నదని చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారని మనం తినంగా మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా ప్యాకింగ్ చేసి అన్నార్థులకు అందించడం ద్వారా వారి కడుపు నింపినవారిమవుతామని సామజిక బాధ్యతగా అందరూ ఆహార వృధాను అరికట్టాలని తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ వి.మాధవి,సి ఎస్ పురము ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ షేక్ షఖీల పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *