దళిత ఎంపీ మీద దాడిని తీవ్రంగా ఖండించిన దళిత హక్కుల వేదిక నియోజకవర్గ అధ్యక్షుడు గోన దానయ్య

దళిత ఎంపీ మీద దాడిని తీవ్రంగా ఖండించిన దళిత హక్కుల వేదిక నియోజకవర్గ అధ్యక్షుడు గోన దానయ్య
కనిగిరి అక్టోబర్ 16 (న్యూస్ మేట్) : 16/10/20ప్రకాశం జిల్లా కనిగిరిలో దళిత హక్కుల వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈసందర్భంగా దళిత హక్కుల వేదిక కనిగిరి నియోజకవర్గ అధ్యక్షుడు గోన దానయ్య మాట్లాడుతూ నిన్న సాయంత్రం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం లో ఎంపి నందిగం సురేష్ పై దాడికి యత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని దాడి వెనుక ఉన్న అగ్రవర్ణాల వారిని వెంటనే పట్టుకొని అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత హక్కుల వేదిక కనిగిరి నియోజకవర్గ అధ్యక్షుడు డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయడంలో విఫలమవుతుంది కాబట్టే దళితుల మీద అంబేద్కర్ విగ్రహాల మీద రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత ఎంపీల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను కఠినంగా అమలు చేసి ఈవిధమైన దాడులకు పాల్పడుతున్న వారిని వారి వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలి లేనిపక్షంలో దళితుల ఐక్య ఉద్యమం చేయవలసి వస్తుంది అని ఆయన హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *