కరోనా వైరస్ పట్ల అజాగ్రత్త తగదు.. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్

కరోనా వైరస్ పట్ల అజాగ్రత్త తగదు.. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్
ఒంగోలులో అక్టోబర్ 20 న్యూస్ మేట్ : 20/10/20కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా పూర్తిగా తగ్గిందన్న భావనతో ప్రజల నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన అన్నారు.కరోనా వైరస్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో పోలేదని ప్రభుత్వ అధికారులు సూచించిన సూచనలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా బారినుండి రక్షించుకోవాలని ఆయన కోరారు. గ్రామ పట్టణ ప్రాంతాలలో క్రింది స్థాయి అధికారులు సిబ్బందిని ఎప్పటికప్పుడు జాగరూకతతో మెలుగుతూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన కోరారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా నుండి ప్రజలు రక్షించుకోవచ్చని అన్నారు. షాపింగ్ మాల్స్ నిర్వాహకులు ప్రార్థనా మందిరం మత పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కిందిస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.నవంబర్ నుండి విద్యాసంస్థలు ప్రారంభం కానుండగా విద్యార్థులు కరోనా బారిన పడకుండా విద్యాసంస్థలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు .సమావేశంలో జాయింట్ కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈవో ఇతర అధికారులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *