జిల్లా సమస్యలపై ఎంపీ ని కలిసిన సిటిజన్ ఫోరం, చైతన్యస్వర భారతి సభ్యులు

జిల్లా సమస్యలపై ఎంపీ ని కలిసిన సిటిజన్ ఫోరం, చైతన్యస్వర భారతి సభ్యులు
ఒంగోలు అక్టోబర్ 20 న్యూస్ మేట్ : 20/10/20ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంటశ్రీనివాసులురెడ్డికి జిల్లాలోని పలు సమస్యలపై ఒంగోలు సిటిజెన్ ఫోరమ్ అధ్యక్షుడు కొల్లా మధు,చైతన్యస్వరభారతి అధ్యక్షుడు నూకతోటి శరత్ బాబు విజ్ఞాపన పత్రం అందజేసారు.ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల ఏర్పాటులో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో చేర్చాలన్న ప్రతిపాదన విరమించుకుని ఒంగోలు జిల్లాలోనే సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ఉంచాలనికోరారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు లోనే ట్రిపుల్ ఐటీ ఉండేటట్లు చూడాలని తెలిపారు. విద్యార్థులకు,యువతకు విజ్ఞానానికి అవసరమైన సైన్స్ సెంటర్ మరియు ప్లానిటోరియం ఏర్పాటు చేయాలని,ఎన్నాళ్లనుండో అసంపూర్తిగాఉన్న పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి కాలువకు ఇరువైపులా రోడ్లు వేసి పర్యాటకకేంద్రంగా రూపుదిద్దాలని,పుణ్యక్షేత్రమైన పెళ్ళూరు,వల్లూరు చెరువునును ఆధునీకరించి భక్తులకు,ప్రజలకు నెల్లూరు తరహాలోనే పర్యాటక ప్రదేశం గా రూపుదిద్ది వసతి గృహాలని నిర్మించాలనికోరారు.సంగీత కళాశాల,వేయి మంది ప్రేక్షకులు కూర్చునే విధంగా ఇండోర్ ఆడిటోరియం నిర్మించాలని, దీనితోపాటు ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నిర్మించాలని,ఒంగోలు నడిబొడ్డులో ని ఊరచెరువులో పార్కును నిర్మించి డిజిటల్ లైట్స్,వాటర్ ఫౌంటైన్లు,గేమ్స్ కుఅనుగుణంగా నిర్మించి పట్టణంలోని ప్రజలకు విహారకేంద్రంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.సుజాతానగర్,అంజయ్యరోడ్డుకు అనుసంధానంగా అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు.కార్పొరేషన్ గా రూపొందిన ఒంగోలు నగరంలో ప్రజల సౌకర్యంతోపాటు ట్రాఫిక్ కు అనుగుణంగా రోడ్ల విస్తీర్ణం పెంచాలని కోరారు.జిల్లాలో ఉన్న పర్యటకకేంద్రాలను అభివృద్ధి చేసి ,హాస్పిటాలిటీ మనేజిమెంట్ కాలేజీ, యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని కోరారు. సమస్యలన్నీటీ పై సానుకూలంగా స్పందించిన మాగుంట అధికారులదృష్టికి ,ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో తులసీ బాబు,భరత్, నవయుగఫౌండేషన్ ఛైర్మెన్ కొమ్మి మస్తాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *