సింగరాయకొండ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలి..తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ అబ్దుల్ అజీమ్.

సింగరాయకొండ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలి..
తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ అబ్దుల్ అజీమ్.
సింగరాయకొండ అక్టోబర్ 20 న్యూస్ మేట్ : 20/10/20గత ప్రభుత్వ హయాంలో అన్ని విధాలుగా సింగరాయకొండ అభివృద్ధి చెందింది అని తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి షేక్ అబ్దుల్ అజీం అన్నారు . సింగరాయకొండ పంచాయితీ సమస్యలపై మంగళవారం ఆయన పంచాయతీ సెక్రటరీ సైదులు ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మంచినీటి ఎద్దడి నుండి ,వీధుల్లో సిమెంట్ రోడ్లు,డ్రైనేజీలు ఏర్పాటు చేశారు అని ఆయన తెలిపారు. కొండేపి ఎమ్మెల్యే స్వామి మేజర్ పంచాయతీ అయినా సింగరాయకొండ లో ప్రభుత్వ మరుగుదొడ్లు లేక సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను గ్రహించి కందుకూర్ రోడ్డు,రైల్వే రోడ్డు పరిధిలో మరుగుదొడ్లు ఏర్పాటుకు పంచాయతీ వారు స్థల సేకరణ చేసి నిధులు విడుదల చేశారు అని ఆయన వివరించారు .ఆ నిధుల ద్వారా ప్రభుత్వం మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి.మరుగుదొడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. గత ప్రభుత్వం తీర్మానం చేసిన స్థలాలలో ప్రభుత్వం మరుగుదొడ్లను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మేకల నరేష్, హరిబాబు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *