స్ఫూర్తి సేవా సంస్ధ సేవలను కొనియాడిన కలెక్టర్ పోలా భాస్కర్
టంగుటూరు అక్టోబర్ 20 న్యూస్ మేట్ : మండల కేంద్రమైన టంగుటూరు అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన బొడ్డు నరసింహం కుమారుడు వెంకటేశ్వర్లు ఇన్కమ్ టాక్స్ అధికారి తన తండ్రి 11వ వర్ధంతి సందర్భంగా టంగుటూరు సెంటర్లో మంగళవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఇన్కమ్ టాక్స్ అధికారి మేకతోటి దయాసాగర్ ,ఎస్. ప్రవీణ్ చక్రవర్తి( కె .టి .ఎస్ .సంస్థ కాకినాడ ),కొండేపి వైసీపీ ఇన్ చార్జ్ డాక్టర్ వెంకయ్య, రిమ్స్ డైరెక్టర్ రిచర్డ్ (జనరల్ మెడిసిన్ రిమ్స్, ఒంగోలు) పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేశారు. బొడ్డు వెంకటేశ్వర్లు ఇన్కమ్ టాక్స్ అధికారిగా హైదరాబాదులో పని చేస్తూ స్ఫూర్తి సేవ సంస్థ ద్వారా టంగుటూరు, హైదరాబాదులో అనేక రకాలుగా పేద ప్రజలకు నిత్యం సహాయం చేస్తూ ఉంటారు. మెడికల్ క్యాంపు లో గుండె ఆపరేషన్లు, జనరల్ వ్యాధులకు సంబంధించిన క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి మెడిసిన్ మరియు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు . అంతేకాకుండా కంటికి సంబంధించిన కంటి ఆపరేషన్లు, కళ్ళు కనిపించని వారికి మందులు ఫ్రీగా అందిస్తుంటారు. పేదలకు బట్టలు విద్యార్థులు చదువుకోవడానికి ఫ్రీ మెటీరియల్ ,ఫ్రీ కోచింగ్ అలాగే వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ వంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పటివరకు 200 ట్రై సైకిళ్ళు వికలాంగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూడా వికలాంగులకు, మానసిక వికలాంగులకు ట్రై సైకిళ్లు అందించడం జరిగింది. స్ఫూర్తి విజ్ఞాన కేంద్రం టంగుటూరు లో నడపడంతో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకునే పుస్తకాలు సమకూర్చటం, ఫ్రీ బుక్స్, ఫ్రీ ట్యూషన్స్ నడుపుతున్నారు.నిరుపేదలకు తన వంతు సహాయం చేస్తూ నిత్యం పేదల కొరకు తపించిపోయే మనసున్న వ్యక్తి బొడ్డు వెంకటేశ్వర్లు. ఈరోజు జరిగిన తన తండ్రి వర్ధంతి సందర్భంగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలను ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. రక్తదానం చేసిన యువకులను ప్రశంసించి ప్రశంసాపత్రాలను అందించారు. స్ఫూర్తి సేవా సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అందరినీ స్ఫూర్తితో నింపుతూ ఉన్నాయని వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉండాలని కోరారు.