కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి.ఎంపీడీవో రఫిక్ అహ్మద్.

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి.
ఎంపీడీవో రఫిక్ అహ్మద్.20/10/20

వలేటివారిపాలెం అక్టోబర్ 20 న్యూస్ మేట్  : కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎంపీడీవో రఫీక్ అహ్మద్ అన్నారు మంగళవారం అంకభూపాలపురం గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. కరోనా రోగులకు ఎంపీడీవో రఫిక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం కళ్యాణి, ఆశా కార్యకర్త కల్పన,వలంటీర్ శామ్యూల్ మందుల కిట్లను పంపిణీ చేశారు. గ్రామంలోని సుమారు 10 కేసులు నమోదు అయిన దృష్ట్యా ఎస్సీ కాలనీ పూర్తిగా శానిటైజేషన్ చేయించడం జరిగింది. అనంతరం గ్రామ సచివాలయన్ని సందర్శించి గ్రామ పెద్దలు బొమ్మిరెడ్డి తిరుపతిరెడ్డి, సన్నపురెడ్డి నాగిరెడ్డి సమక్షంలో చర్మకారుల పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఖచ్చితంగా షాపులో ప్రతిరోజు పనిచేయాలని సూచించారు. అప్పుడు మాత్రమే వారికి పెన్షను ప్రభుత్వం నుంచి లభిస్తుందని తెలిపారు. అనంతరం వలంటీర్లకు శానిటైజేషన్ పై పూర్తిస్థాయి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *