జి ప్లస్ త్రీ గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలి.. సిపిఐ

జి ప్లస్ త్రీ గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలి.. సిపిఐ
కందుకూరు అక్టోబర్ 20 న్యూస్ మేట్ : 20/10/20కందుకూరు పట్టణం లో నిర్మించిన జి ప్లస్ త్రీ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ సిపిఐ నాయకులు మంగళవారం ఆర్డిఓ కార్యాలయం సూపర్నెంట్కి వినతి పత్రం అందజేశారు .రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ. పిలుపులో భాగంగా కందుకూర్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ కందుకూరు నియోజకవర్గ సహాయ కార్యదర్శి పి సురేష్బాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో నిర్మించిన జి ప్లస్ త్రీ గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి లబ్ధిదారుల నుండి లక్షల రూపాయల డిపాజిట్లు వసూలు చేసి నిర్మించిన ఇళ్లను ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఎందుకు అంద చేయ లేదని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కేవలం కక్షసాధింపు ధోరణితోనే గత ప్రభుత్వం నిర్మించిన గృహాల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన అన్నారు .ఇప్పటికైనా ప్రభుత్వం మొండి పట్టు వీడి గత ప్రభుత్వ సమయం లో నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఆనందమోహన్ ఏఐటీయూసీ నాయకులు అన్నవరపు బ్రహ్మయ్య ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి బి చంద్రమోహన్ సిపిఐ నాయకులు సుబాన్ లు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *