అప్రమత్తతతో గాలికుంటు వ్యాధి నివారణ.వర్షాకాలంలో వ్యాధి సోకే ప్రమాదం అధికం.

అప్రమత్తతతో గాలికుంటు వ్యాధి నివారణ.
వర్షాకాలంలో వ్యాధి సోకే ప్రమాదం అధికం.
పశుసంవర్ధక శాఖ అధికారి ఏడి బ్రహ్మయ్య.

వలేటివారిపాలెం అక్టోబర్ 20 న్యూస్ మేట్ :20/10/20 వ్యవసాయ రంగంలో పాడి పశువుల బంధం విడదీయలేనిది. వ్యవసాయానికి పనికి వచ్చే ట్రాక్టర్లు ఇతర యంత్రాలు రాకముందు నుంచి ఎద్దులు,దున్నలు వ్యవసాయం లో కీలక పాత్ర వహిస్తున్నాయి. పొలాల్లో దుక్కి దున్నాలన్నా, సాగు చేయాలన్నా ఎద్దులు దున్నపోతులు అవసరం నేటికీ ఉంది. వీటితోపాటు పాడి పశువులు,ఆవులు,గొర్రె లకు సైతం గాలికుంటు వ్యాధి సోకే ప్రమాదం ఉందని వలేటివారిపాలెం పశుసంవర్ధక శాఖ ఏడి కెవి బ్రహ్మయ్య హెచ్చరిస్తున్నారు. రైతుల ఆదాయ వనరులను దెబ్బతీస్తే ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. వర్షాకాలంలో ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుందని వ్యాధి రాకముందే రైతులు తమ పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ముందస్తు జాగ్రత్తలు పాటించటం చేయాలని సూచిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు
గాలికుంటు వ్యాధి వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పాడి పశువుల మరణాల సంఖ్య తక్కువే అయినప్పటికీ ప్రమాదం మాత్రం పొంచి ఉంటుంది. ఏ ఓ టి ఆసియా-10, ఆసియా-22 పిటార్నో వంటి వైరస్ వల్ల సోకే ప్రమాదకరమైన అంటు వ్యాధి కావడంతో పశువులు ఉత్పాదక శక్తి సామర్ధ్యం తగ్గిపోతుంది. వ్యాధినిరోధకశక్తి తక్కువగా బలహీనంగా ఉండే యుక్తవయసు పశువుల్లో వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. తీవ్ర జ్వరం,కాళ్ల నొప్పులు,గిట్టలు మధ్య పుండ్లు ఏర్పడతాయి. గిట్టలు ఊడిపోయి నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. నాలుక మీద నోటి లోపల భాగంలో అల్సర్లు ఏర్పడి నోటి వెంట సొంగ కారుతుంది. దీనితో మేత మెయలేని పరిస్థితి కలుగుతుంది. గర్భంతో ఉన్న పశువులకు గర్భస్రావం అవుతుంది. పాలిచ్చే పశువుల్లో పాలు ఉత్పత్తి తీవ్రంగా తగ్గిపోతుంది. పొదుగుపై కూడా బొబ్బలు రావడంతో పొదుగు వాపు వ్యాధి కూడా వస్తుంది. బ్యాక్టీరియా చేరి చీము పడుతుంది. చీము కారడం వలన ఇతరత్రా రోగాలు వస్తాయి. చీము పై ఈగలు వాలి గుడ్లు పెట్టడం వలన ఈ గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు కండరాలకు చేరి వాటికి హాని కలిగిస్తాయి. దీనితో పెద్ద గాయాలు ఏర్పడి ప్రమాదం పొంచి ఉంటుంది. ముఖ్యంగా వ్యాధి సోకిన తరువాత కూడా 2 నుంచి 3 ఏళ్ల పాటు పశువుల శరీరంపై వ్యాధి ప్రభావం ఉంటుంది. వేసవిలో విపరీతంగా ఆయాసానికి రొప్పు కు గురవుతాయి. ఈ వ్యాధి సోకిన పాడి గేద పాలు తాగిన దూడలు మృత్యువాత పడతాయి.

నివారణ చర్యలు ఇవి….
ఈ వ్యాధి సోకిన పశువులకు పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని గిట్టల వద్ద పుండ్లు సోకిన ప్రాంతంలో వేసి శుభ్రం చేయాలి. బోరో గ్లిజరిన్ పూత పోయాలి ఈగలు వాలకుండా వేపనూనె లారాజేంట్ మిన్మెంట్ వంటి మందులు వాడాలి. పశువైద్యాధికారి సూచనల మేరకు యాంటీబయోటిక్ పెయిన్ కిల్లర్ మందులు వేయాలి. ఈ వ్యాధి సోకిన పశువులకు రోజు 50 గ్రాముల బయోడైజెడ్ ఉప్పు దానాతో ఇస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. ఇదేవిధంగా 30 గ్రాముల ఎముకల పొడి ( మినరల్ మిక్చర్ ) పచ్చి గడ్డి తో కలిపి రోజూ అందిస్తే త్వరగా కోలుకుంటాయి. అన్నిటికన్నా మించి టీకాలు వేయిస్తే పాల ఉత్పత్తి తగ్గిపోతుందని,గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని, వేసిన వాపు వస్తుందనే అపోహలు వీడాలి. పశువులకు గొర్రెలకు టీకాలు వేయించాల్సిన ఆవశ్యకత ఉంది.
పశుసంవర్ధక శాఖ ఏడి కేవి బ్రహ్మయ్య

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *