పాలాభిషేకం వెనుక పరమార్థం..’మాగుంట’ అంతరార్థం ఏమిటో..?

పాలాభిషేకం వెనుక పరమార్థం..
‘మాగుంట’ అంతరార్థం ఏమిటో..?
ఒంగోలు అక్టోబర్ 20 (న్యూస్ మేట్) : 20/10/20ఉపకారానికి పరోపకారం తప్పులేదు . ఎవరు ఆక్షేపించ వలసిన అవసరం లేదు. కానీ ఒక ఎంపీ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం వెనుక ఏదోపరమార్థం దాగి ఉన్నట్లుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విశిష్ట రాజకీయ చరిత్ర కలిగిన మాగుంట కుటుంబసభ్యుడు ఆ కార్యం నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది .ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం బీసీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ లతో కలిసి కలెక్టర్ కార్యాలయం సమీపంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర ముఖ్య మ౦త్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం చర్చనీయాంశమైంది .ఒక పార్లమెంట్ సభ్యుడు అందునా తన కంటే పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం తన హోదా కి తగదని, ఇదేవిధమైన రాజకీయ సంస్కృతి అని మేధావులు రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్త౦చేస్తు న్నారు. ముఖ్యమంత్రి 56 బిసి కులాలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇటీవలే ప్రకటించారు. కృతజ్ఞతగా పదవులు పొందిన బీసీ నాయకులు ముఖ్యమంత్రి కి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు .అయితే బీసీ నాయకులంతా పాలాభిషేకం చేయటం లో ఆశ్చర్యం లేదు కానీ ఎంపీ పాలాభిషేకం చేయటం లో ఆశ్చర్యం ఉంది.. ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్య బిజెపి నాయకులతో రహస్య మంతనాలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసిపి, కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని అదే విధంగా రాష్ట్రంలో బిజెపి వైసిపి తో భాగస్వామ్యం కావాలన్న ఆలోచనకు ఇరు పార్టీలు అంగీకరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో వైసిపికి వచ్చే అవకాశాన్ని తనకు అందివచ్చేలా ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారా! అని వైసీపీలోనే గుస గుసలువినిపిస్తున్నాయి. దివ౦గత మాగుంట సుబ్బరామిరెడ్డి ఎంపీగా ఉన్నప్పటి నుంచి మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజల్లో సమున్నత రాజకీయ స్థానం ఉంది. ఆయన మరణానంతరం సతీమణి మాగుంట పార్వతమ్మ ఒంగోలు పార్లమెంట్ సభ్యురాలిగా తన కుటుంబ ప్రత్యేకతను మరింతఇనుమడి౦ పజేశారు. తర్వాత మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు ఎంపీగా జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కుాడా పార్లమెంట్ సభ్యులుగా కొనసాగిన శ్రీనివాసులు రెడ్డి తన ప్రాధాన్యత ఏమాత్రం తగ్గకుండా చుాసుకున్నారు. తదనుగుణంగానే చంద్రబాబు నాయుడు కుాడా శ్రీనివాసులురెడ్డి కి సముచిత స్థానం కల్పించారు. అదేవిధంగా రాజకీయంగా ఎంతో చాతుర్యం కలిగినా ఏనాడు.. ఎటువంటి మంత్రి పదవి దక్కించుకోలేదు. అయితే ఈ నాడు కేంద్రంలో వైసీపీకి మంత్రివర్గంలో ఆ అవకాశం లభిస్తుందన్న ఆలోచన ఆ పార్టీ ఎంపీల్లో బలంగా నెలకొన్నది. ఈ నేపథ్యంలో రాజకీయంగా సీనియర్ అయిన శ్రీనివాసులు రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందేమో అనే ఆశ లేకపోలేదు.సీనియర్టి కంటే కూడా సీఎం దృష్టిలో పడే పనిలో భాగంగానే ఈతత౦గమని ప్రజలు అనుకుంటున్నారు.ఎవరు ఏమి అనుకున్నా ఎలా ఊహించుకున్నా పాలాభిషేకం వెనుక ఉన్న అర్థం, పరమార్థం, అ౦తరార్ధ౦ మాగుంట కే ఎరుక.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *