పామూరు పట్టణంలోని ఎన్జీవో కాలనీ లో రోడ్ల దుస్థితి తెలియజేస్తూ వరి నాటిన కాలనీవాసులు

పామూరు పట్టణంలోని ఎన్జీవో కాలనీ లో రోడ్ల దుస్థితి తెలియజేస్తూ వరి నాటిన కాలనీవాసులు

పామూరు అక్టోబరు 20 (న్యూస్ మేట్) : 20/10/20భారతీయ జనతా పార్టీ మండల కమిటీ అధ్యక్షులు కోడూరు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎన్జీవో కాలనీ లో రోడ్డుపై వరి నాటే కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంనికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండి శెట్టి వెంకటరమణయ్య పాల్గొని మహిళలచే రోడ్డుపై వరి నారు నటించారు. అనంతరం రమణ మాట్లాడుతూ పామూరు లో డి వీ అపార్ట్మెంట్ నుండి పోతవరం పోయే రోడ్డు మధ్య కురిసిన వర్షానికి వచ్చిన నీరు రోడ్డుపై నిలిచి వచ్చే పోయే వారికి దారి మార్గం లేక ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి దుర్గంధ పూరితం గా ఉన్నది దీనివలన ప్రజలకు ఇబ్బంది కలిగి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. పందులు దోమల ద్వారా రోగాలు ప్రబలి, కోవిడ్ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని తక్షణమే పంచాయతీ వారు చర్యలు తీసుకొని ఈ గ్రామంలో అపరిశుభ్రత గా ఉన్న ప్రదేశాలను పరిశీలించి రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ. నిరసనగా ఈ వరి నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం లో షేక్. మౌలాలి, వేటూరి మోహన్, హరియరం రత్తయ్య, ఖాజావలి, పత్తి ఈశ్వరమ్మ , ఎం. బ్రహ్మయ్య, పత్తి ప్రసాదు, ఎన్జీవో కాలనీవాసులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *