వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితుల అభివృద్ధి శూన్యం జనసేన నేత మనోజ్ కుమార్

వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితుల అభివృద్ధి శూన్యం జనసేన నేత మనోజ్ కుమార్
కొండపి అక్టోబర్ 20 న్యూస్ మేట్ : భారత రాజ్యాంగం ప్రకారం ఎస్ సి లు అభివృద్ధి చెందడానికి రాజ్యాంగబద్ధంగా రూపొందించిన ప్రతిష్టాత్మకమైన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మాయమైపోయాయి అని కొండేపి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కనపర్తి మనోజ్ కుమార్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సబ్సిడీ రుణాలు అమలు చేయదా ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన ప్రశ్నించారు.ఎస్సీ కార్పొరేషన్ రుణాలు లేనట్టా ఉన్నట్టా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఇది ప్రజలు గ్రహించాలి, ఎస్సీలుగా ఉన్న ఎమ్మెల్యేలు మరియు మంత్రులు కార్పొరేషన్ సబ్సిడీ రుణాలును గురించి పట్టించుకోవడం లేదు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రతి సంవత్సరం సబ్సిడీపై ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలు ఏమయ్యాయి,ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కార్పొరేషన్ పశువులు ద్వారా,వ్యాపారాల ద్వారా, వాహనాల ద్వారా, వివిధ రూపాల్లో ఆర్థికంగా సహాయం చేస్తూ ప్రతి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ముందుకు తీసుకెళ్తుంది. గతంలో ఎస్సీ ల అభివృద్ధికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్ఎప్డిసి మరియు ఎస్ఎస్ కెఎప్డి సిపథకాల ద్వారా స్వయం ఉపాధికి వాహనాల ద్వారా వ్యాపారాల ద్వారా 60 శాతం సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు, అంతేకాకుండా భూమి కొనుగోలు పథకం ,స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు , అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలుకు కోచింగ్ ఇవ్వడం,అనగారిన వర్గాలకు సహాయం చేయడం జరిగేవని, కానీ ఈ ప్రభుత్వం లో ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది అని ఆయన తెలిపారు. రాజ్యాంగబద్ధంగా అమలయ్యే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఎక్కడికి పోయాయి. 2014 నుండి ఇప్పటివరకు టిడిపి ప్రభుత్వం గాని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గాని ఒక్క సెంటు భూమి కూడా కొనుగోలు చేసి దళితులకు ఇవ్వలేదు, దళితులు ఈ విషయాన్ని గమనించాలి, రాజ్యాంగబద్ధంగా రూపొందించిన ఎస్సీ అభివృద్ధి పథకాలను యధావిధిగా కొనసాగించి దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళి అభివృద్ధి చేయాలని అందుకు జనసేన ఎప్పుడూ ముందుంటుందని మనోజ్ కుమార్ తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *