వైభవంగా శ్రీ సరస్వతి దేవి పూజ
సింగరాయకొండ అక్టోబర్ 22 న్యూస్ మేట్ : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సింగరాయకొండ మండలం మల్లికార్జున నగర్ శ్రీ కోదండ రామ స్వామి దేవాలయం నందు శ్రీ శ్రీ శ్రీ సరస్వతి దేవి పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా సహ కన్వీనర్ శ్రీ మిడసల బాలకోటయ్య ప్రకాశం జిల్లా బాల వికాస కేంద్రం జిల్లా కన్వీనర్ శ్రీ అర్రిబోయిన రాంబాబు పారాలీగల్ వాలంటీర్ శ్రీ పంతగాని వెంకటేశ్వర్లు ఉభయ దాతలు ఎన్.ఆర్.ఐ శ్రీ తన్నీరు సుధాకర్ పాల్గొని అన్నసంతర్పణ గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి కృష్ణ స్వామి, భక్తులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు