ఆదర్శ వివాహం జరిపించిన పట్టణ ఎస్ఐ తిరుపతిరావు
కందుకూరు అక్టోబర్ 22 ( న్యూస్ మేట్ ) : స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ కె. కె.తిరుపతిరావు ప్రేమికులను కలిపి ఆదర్శ వివాహం జరిపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన అర్బన్ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న దళిత కులానికి చెందిన యువతి, కందుకూరు డి ఆర్ డి ఏ ట్రైనింగ్ సెంటర్ లో పనిచేస్తున్న పుల్లలచెరువుకు చెందిన బిసి(యాదవ) కులానికి చెందిన యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటూ పెళ్లి కోసం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారని తెలిపారు. దీంతో ఇరువు పెద్దలను పిలిపించి వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వచించి ఒప్పించటం జరిగిందన్నారు. సాంప్రదాయం గా పట్టణం లోని చర్చిలో వివాహం నిర్వహించారు. ఎస్ ఐ తిరుపతిరావు ని రాష్ట్ర ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు శాలువాతో సన్మానించి,పుష్ప గుచ్ఛం తో అభినందించారు.