సచివాలయ ఉద్యోగుల సమస్యల పట్ల బాధ్యతగా మెలగాలి ఎమ్మెల్యే

సచివాలయ ఉద్యోగుల సమస్యల పట్ల బాధ్యతగా మెలగాలి ఎమ్మెల్యే
లింగసముద్రం అక్టోబర్ 22 న్యూస్ మేట్ : –  22/10/20సచివాలయ ఉద్యోగులు సమాజంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో బాధ్యతగా పనిచేయాలని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి తెలియజేశారు . గురువారం స్థానిక వేముల అంజయ్య కళ్యాణ మండపంలో ఎంపీడీవో కే మాలకొండయ్య అధ్యక్షతన జరిగిన సచివాలయ ఉద్యోగుల దిశానిర్ధేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ను ప్రారంభించారని ఈ సచివాలయ వ్యవస్థ పెట్టడం ద్వారా ముఖ్యమంత్రిని దేశం మొత్తం కొనియాడుతుందని, అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగిన వారే క్షేత్ర స్థాయిలో రాణిస్తారని అన్నారు .ప్రతి కుటుంబానికి మంచి నీరు అందించడమే లక్ష్యంగా జల జీవన్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని దీనికోసం నియోజకవర్గానికి 7.8 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారన్నారు. 14 ,15 వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించి గ్రామాలలో లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, మండలంలో ఖాళీగా ఉన్న 65 సచివాలయ పోస్టులను త్వరలో భర్తీ చేస్తారు అని అన్నారు. త్వరలో కందుకూరు నుండి వివి పాలెం కు నాలుగు లైన్ల రహదారి లింగసముద్రం కు రెండు లైన్ల రహదారి ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మండలంలో 2,700 ఎకరాల పేదల భూములు చేతులు మారి అనర్హుల చేతుల్లో ఉంది అన్నారు. పెద్దపవని మాజీ వి ఆర్ ఓ ఒకరు రికార్డులను తారుమారు చేసి 80 ఎకరాల భూమిని ఆక్రమించారని అన్నారు. వారి బంధువు ఒకరు టేకు చెట్లను కొట్టి అమ్మారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి త్వరలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కు శ్రీకారం చుట్ట బోతున్నారన్నారు. మండలంలో బాగా పని చేసిన సచివాలయ ఉద్యోగులకు మెమొంటో లు అందజేశారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *