ఉపాధి పనులు గుర్తింపు కై సిబ్బందితో సమీక్ష
గుడ్లూరు అక్టోబర్ 22 న్యూస్ మేట్ : మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు గుర్తింపు 16 గ్రామ సచివాలయ కేంద్రాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బందితో ఎంపీడీవో ఎం వెంకటేశ్వర్లు గురువారం సమీక్ష సమావేశం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలో 2021, 22 సంవత్సరం కు గాను జరపాల్సిన ఉపాధి హామీ పనులపై తగు నివేదిక ప్రణాళికను రూపొందించడం జరుగుతుందన్నారు. అలాగే మండలంలో ఉపాధి హామీ పనులు పారదర్శకంగా జరిగే విధంగా చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయా గ్రామాల్లో పనుల గుర్తింపుకు అనుగుణంగా లేబర్ బడ్జెట్ ను కూడా తదుపరి రూపొందించడం జరుగుతుందని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో ఏ పీ ఓ పాటిబండ్ల సమ టెక్నికల్ అసిస్టెంట్లు సచివాలయం సిబ్బంది మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.