మేము మురికి తో ఇంకెన్నాళ్లు జీవించాలి – మాకు విముక్తి లభించదా…?

మేము మురికి తో ఇంకెన్నాళ్లు జీవించాలి22/10/20
మాకు విముక్తి లభించదా…?

కందుకూరు అక్టోబర్ 22 న్యూస్ మేట్ : అసలే వానాకాలం దానికి తోడు దోమలతో సహజీవనం చేయాల్సిన రోజులు అన్ని తెలిసినా ఏ మాత్రం ప్రజా ప్రతినిధులు , ప్రభుత్వ అధికారులు పట్టించుకోక పోవడం వారి పాలన ఏ పరిపాటిదో అర్థమౌతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్య పనులు వేగవంతం చేయడానికి అనేక రకాల పేర్లతో కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.అయితే పారిశుధ్య పనులు మాత్రం తూతూ మంత్రం గానే జరుగుతున్నాయి. అందుకు నిదర్శనం పట్టణంలోని శివారు ప్రాంతాలను పరిశీలిస్తే తెలుస్తుందని ప్రజలు తెలుపుతున్నారు.రాజకీయ నాయకులు మాత్రం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఏ ఒక్క ఏరియా ను వదలకుండా కాలి నడకన తిరుగుతారని, ఎన్నికల్లో గెలిచిన తరువాత వారికి ఏ ఏరియా ఎక్కడ ఉందో తెలియకుండా పోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టణంలోని 14 వార్డు లో కోదండరామస్వామి దేవాలయ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం సిమెంటు రోడ్లు ను నిర్మించారు.కానీ సైడు కాలువలు వేయడం మరిచారు దాంతో మురికి నీరు పోయేందుకు వీలు లేక మరో మూసీ నది లా మారుతుంది. వాన పడినప్పుడల్లా ఆప్రాంతంలో చిల్ల చెట్లు పెరిగి అడవిని తలపిస్తుంది. దాంతో అక్కడ పందులు నివాసం గా చేసుకొని రోగాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. అసలే ఒక పక్క ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విస్తరించి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. దానినీ అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.అలాంటి సందర్భంలో 14 వ వార్డు లో పందులతో,దోమలతో నివసిస్తున్న మా పరిస్థితి ఏమిటని అక్కడి ప్రజలు నాయకులను, అధికారులను ప్రశ్నిస్తున్నారు. మేము మురికి తో ఇంకెన్నాళ్లు జీవించాలి మాకు విముక్తి లభించదా అని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వాలు , అధికారులు మారుతున్నా మేము ఎదుర్కొంటున్న సమస్యను మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మా సమస్య గురించి మున్సిపాలిటీకి వచ్చిన ప్రతి అధికారికి విన్నవించుకున్నా ఫలితం శూన్యం గానే కనిపిస్తుంది తప్ప మా సమస్యను పరిష్కరించే నాథుడే కరువయ్యారని వారు పేర్కొన్నారు. మా సమస్య గురించి అనేక మార్లు పత్రికలలో ప్రచురితమైనప్పుడల్లా మున్సిపల్ సిబ్బంది వచ్చి హడావుడి చేస్తున్నారు తప్ప సమస్యను పూర్తిగా ప్రయత్నం చేయడం లేదని వారు వాపోతున్నారు. పారిశుధ్యం చేసే కార్మికులు అధిక శాతం ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పారిశుధ్య పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికుల ప్రాణాలపై లెక్కలేకపోవడం శోచనీయమని కార్మిక యూనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పట్టణ శివారు ప్రాంతాల్లో నెలకొని ఉన్న పారిశుధ్య పనులను వేగవంతం చేసి అక్కడ నివసిస్తున్న ప్రజల ప్రాణాలను కాపాడాలని అక్కడి ప్రజలు ప్రజాప్రతినిధులను, అధికారులను కోరుతున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *