బహుళ ప్రయోజనాలుగల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంపీడీవో రంగ సుబ్బారాయుడు

బహుళ ప్రయోజనాలుగల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంపీడీవో రంగ సుబ్బారాయుడు
పామూరు సెప్టెంబర్ 22( న్యూస్ మేట్) : 22/10/202021-22 ఆర్థిక సంవత్సరానికి ఉపాదిహామీ పథకం పనుల గుర్తింపులో బహుళ ప్రయోజనాలు గల పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీడీవో మంచికంటి రంగసుబ్బరాయుడు పేర్కొన్నారు . స్థానిక ఉపాది కార్యాలయ సమావేశ హాలులో గురువారం సాయంత్రం ఏపీవో మాచర్ల అధ్యక్షతన రానున్న ఆర్థిక సంవత్సరానికి ఉపాది పనుల గుర్తింపుపై అనుసరించాల్సిన విధివిధానాలపై పంచాయతీ కార్యదర్శులు , వీఆర్ వోలు , ఇంజనీర్ అసిస్టెంట్లు , సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ప్రజలకు అవసరమైన పనులు గుర్తించాలన్నారు . పనుల గుర్తింపు పారదర్శకంగా జరగాలని , జాబ్ కార్డులు ఉన్నవారందరికి ఉపాది పనులు కల్పించేలా పనుల గుర్తింపు ఉండాలన్నారు . కార్యక్రమంలో ఈవోఆర్డీ వి . బ్రహ్మానందరెడ్డి , పీఆర్ఎఈ యం.వెంకటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *