విశిష్ట ఆలంకారంలో వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి మూలవిగ్రహమూర్తి

విశిష్ట ఆలంకారంలో వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి మూలవిగ్రహమూర్తి
పామూరు సెప్టెంబర్ 22 (న్యూస్ మేట్) : చదువులతల్లి శ్రీ సరస్వతీదేవీ సమోస్తుతే అంటూ విధ్యార్థులు , భక్తులు ప్రణమిల్లారు . దసరా శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా 6 వ రోజు

22/10/20

గురువారం శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు . ఈ సందర్భంగా అర్చకులు రాయప్రోలు తులసీనాథ్ అమ్మవారి మూలవిగ్రహమూర్తికి , ఉత్సవమూర్తికి విశేషపూజలు నిర్వహించారు . శరన్నవరాత్రి వేడుకలకు తోడు సరస్వతీదేవి జన్మనక్షత్రమైన మూలానక్షత్రంకూడా కలసిరావడంతో ఈ రోజును శుభప్రదమైనదిగా భక్తులు భావిస్తుండటంతో అధిక సంఖ్యలో వాసవీమాత ఆలయానికి తరలివచ్చి ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు . కాగా స్థానిక ఆకులవీధిలోని మహాలక్ష్మమ్మ అమ్మవారు వైష్ణవీమాతగా , సాయిబాబా ఆలంయంలో సాయినాథుడు విశేష అలంకారములో భక్తులకు దర్శనమిచ్చారు . శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా దేవస్థానాలను రంగురంగుల విద్యుద్దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దగా దేవస్థాన కమిటీ ఆద్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

 

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *