మాల లను కించపరిస్తే ఖబడ్దార్ దళిత సంఘాలు
కనిగిరి అక్టోబర్ 22 (న్యూస్ మేట్) : మాలలను కించపరుస్తూ కులం పేరుతో దూషించిన ఎన్నారై ప్రభాకర్ రెడ్డి ని అరెస్టు చేయాలని జై భీమ్ యాక్సెస్ జస్టిస్ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో కనిగిరి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు .అనంతరం ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాలలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా ఎస్సై రామి రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దళితులను కించపరిచే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ కార్యక్రమంలో జై భీమ్ జస్టిస్ అధ్యక్షులు సత్యం వెంకటేశ్వర్లు. మాల మహానాడు సింహాద్రి బ్రహ్మయ్య. దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు పందిటి మోహన్. అంబేద్కర్ ధర్మ పోరాట సమితి అధ్యక్షులు చదలవాడ బాల గురవయ్య. మాలల ఐక్యవేదిక నాయకులు శాంతా రాజు. మరియు దళిత నాయకులు దశరథ. జి కే జయరాజు. బాలు మొదలగు వారు పాల్గొన్నారు.