అనగారిన వర్గాల ఆశాజ్యోతి ఎస్ ఆర్ శంకరన్ బి కే ఎన్ యు నాయకులు వెంకట్రావు

అనగారిన వర్గాల ఆశాజ్యోతి ఎస్ ఆర్ శంకరన్ బి కే ఎన్ యు నాయకులు వెంకట్రావు
ఒంగోలు అక్టోబర్ 22 న్యూస్ మేట్ : అనగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతమైన22/10/20 వ్యక్తి ఎస్ ఆర్ శంకరన్ అని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్ రావు అన్నారు. శంకరన్ 86 వ జయంతి సందర్భంగా బి కే ఎం యు ,డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో గురువారం మల్లయ్య లింగం భవన్లో శంకరన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితమంతా నిరాడంబరంగా నిజాయితీగా గడప టమే కాక తనకంటూ సొంత ఇల్లు కూడా ఏర్పరచు కోలేదు .ఒక ఐఏఎస్ అధికారి నిక్కచ్చిగా సమాజంలో అట్టడుగు వర్గాలకు ఏ స్థాయిలో సేవ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చో ప్రత్యక్షంగా ఆచరించే చూపించిన వ్యక్తి శంకరన్ అని ఆయన కొనియాడారు. శంకరన్ తమిళనాడులోని తంజావూర్ లో 1934 అక్టోబర్ 22న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారని ఆయన తెలిపారు .దళితుల అభ్యున్నతి కోసం ఒక్క సంవత్సరంలోనే 120 జీవోలకు పైగా విడుదల చేసిన దళిత శ్రేయోభిలాషి అని ఆయన అన్నారు .1976లో వచ్చిన వెట్టిచాకిరి నిషేధ చట్టం ఆయన కృషి ఫలితమే అని ఆయన అన్నారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డుని సున్నితంగా తిరస్కరించిన అతి సామాన్య వ్యక్తి అని ఆయన గుర్తు చేశారు .దళిత వర్గాలకు సేవ చేయడంలో అలుపెరుగని బాటసారి శంకరన్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *