దళిత యువకుడిపై దాడి చేసిన టీడీపీ నేత కిషోర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి దళిత సంఘాలు

22/10/20ఒంగోలు అక్టోబర్ 22 న్యూస్ మేట్ : దళిత యువకుడిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన పమిడి కిషోర్ ని వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఒంగోలు ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశానికి కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బహుజన రచయితల వేదిక రాష్ట్ర నాయకులు నూక తోటి రవికుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసులలో యువకులు గ్రామాలలో దళిత రక్షణ దళం ఏర్పాటు చేసుకుని ధైర్యంగా ఉండాలని కోరారు. దళితులంతా ఒకటైతే అగ్రకుల దాడులను తిప్పి కొట్ట వచ్చు అని ఆయన అన్నారు .ఈ నెల 26న దళిత జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీని కలిసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు. ఓ పి డి ఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావల సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో అగ్రవర్ణాల ఆధిపత్యం నుండి రక్షించేందుకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని వాటిని అమలు పరచకుండా పోలీసులు 41 సి ఆర్ పి సి నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వటం అంటే సామాజిక నేరస్తులను రక్షించడమే నని ఆయన అన్నారు .బహుజన సమాజ్ పార్టీ నాయకులు మిరియం అంజిబాబు మాట్లాడుతూ దోషులకు అండగా నిలబడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగమూరు రోడ్డు జంక్షన్ లో పెట్రోల్ బంకులో పెట్రోలు కోసం ఉన్న దళిత యువకుడు కంకణాల నాగరాజ్ పై ఆలకూరపాడు గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు కిషోర్ మద్యం మత్తులో భౌతిక దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దాడులకు ప్రతి దాడి చేసే విధంగా దళితులు తయారు కావాలని కోరారు. టిడిపి రాష్ట్ర నాయకులు ఎద్దు శశికాంత్ భూషన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దళితులపై మాత్రమే దాడులు జరుగుతున్నాయని దీనిపై దళిత సమాజం తీవ్రంగా స్పందించి ఐక్యతతో దాడులను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో లో జై బీమ్ యాక్సిస్ జస్టిస్ రాష్ట్ర కార్యదర్శి కంచర్ల చిట్టిబాబు, పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు రాజశేఖర్ ,ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అధ్యక్షులు దాసరి సుందరం ,అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర నాయకులు బిల్లా చెన్నయ్య ,బి టి ఏ జిల్లా అధ్యక్షులు సువర్ణ రాజ్ ,జై భీమ్ నాయకులు అంబటి కొండల రావు ,ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఉద్యోగుల సంఘం నాయకులు బొడ్డు శ్రీనివాసులు, ఇంకా వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు బి వెంకట్, బొంత వెంకటనారాయణ, సప్పిడి కోటేశ్వరరావు, కంకణాల ఆంజనేయులు, బంటు మళ్ళి రాజు ,కంకణాల యేసు, వాసు మల్ల నాగార్జున, కంకణాల నాగరాజు బి సుబ్బారావు ,సంగీతరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *