స్వర్ణకార కార్మిక సంఘం నాయకుని మృతికి ఏఐటీయూసీ సంతాపం
కందుకూరు అక్టోబర్ 23 న్యూస్ మేట్ : స్వర్ణకార కార్మిక సంఘం నాయకులు అరటి పాముల సుబ్రహ్మణ్యా చారి(84 ) (చాకిచర్ల) శుక్రవారం మృతి చెందారు . ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు .ఆయన అనేక సంవత్సరాలు బీసీ సంఘం ఉద్యమంలో పనిచేశారు. బీసీలను ఐక్య చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. స్వర్ణకార సంఘ నిర్మాతల్లో సుబ్రమణ్య చారి ఒకరు. స్వర్ణకార కార్మిక సంఘ నాయకుడు గా సుమారు 50 సంవత్సరాల పైగా పని చేశారు. సుబ్రహ్మణ్యం ఆచారి మృతి కార్మిక వర్గానికి తీరనిలోటని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి సురేష్ బాబు నియోజకవర్గ అధ్యక్షుడు బాలకోటయ్య స్వర్ణకార కార్మిక సంఘం నాయకుడు బాలబ్రహ్మచారి అప్రైజర్స్ యూనియన్ నాయకులు లంకెనపల్లి బాలబ్రహ్మచారి ఒక ప్రకటనలో తెలిపారు .వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.