టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు ప్రారంభం ప్రిన్సిపల్ డాక్టర్ రవి కుమార్

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు ప్రారంభం ప్రిన్సిపల్ డాక్టర్ రవి కుమార్22/10/20

కందుకూరు అక్టోబర్ 23 న్యూస్ మేట్ : టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2020-21 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ పద్ధతిలో డిగ్రీ లో చేరే ప్రథమ సంవత్సర విద్యార్థినీ విద్యార్థులు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ కళాశాలలో బి ఎ హెచ్ ఇపి,హెచ్ ఈ టి స్పెషల్ ఇంగ్లీష్, బీఎస్సీ ఎంపీసీ , ఎం పి సి బి జెడ్ సి మరియు బీకాం కంప్యూటర్ జనరల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.ఈ విద్యాసంవత్సరం నుంచి ఉపాధి కల్పనే ధ్యేయంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బి ఎస్ సి డేటా సైన్స్ ,ఆక్వా కల్చర్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా ఈ విద్యాసంవత్సరం నుంచి టి ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎమ్మెస్సీ కంప్యూటర్స్ సైన్స్ ఎం.ఏ తెలుగు పి జి కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ లో అర్హత సాధించి విశ్వవిద్యాలయ కౌన్సిలింగ్ ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తారని తెలియజేశారు. తమ కళాశాలలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన అందుబాటులో ఉందని, తమ కళాశాల అధ్యాపకులు జె ఎన్ హెచ్ సి యు లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి డాక్టరేట్ పట్టాలను అందుకుని ఎంతో ఉన్నత ప్రమాణాలు నెల కోల్పోతున్నారని రవికుమార్ తెలిపారు అతి త్వరలోనే మోడల్ కాలేజీ గా ఈ కాలేజీని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలిపారు. కళాశాలలో విద్యా బోధన తో పాటు జె కె సి కంప్యూటర్ ల్యాబ్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, జిమ్ లాంటి అనేక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడలలో కూడా రాణించటానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చే సదుపాయం మరియు విశాలమైన క్రీడా మైదానం తమ కళాశాల ప్రత్యేకతలను ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రతి సంవత్సరం తమ కళాశాల విద్యార్థులు ప్రతిభా అవార్డులు, విశ్వవిద్యాలయ స్థాయి ర్యాంకులు,IIT మరియు సెంట్రల్ యూనివర్సిటీలో సీట్లు సాధిస్తున్నారని, క్రీడల్లో అనేక విభాగాల్లో ప్రధమ స్థానాల్లో నిలుస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం వంద మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు. కందుకూరు పరిసర ప్రాంత విద్యార్థులు ఈ కళాశాలలోని సౌకర్యాలను వినియోగించుకోవాలని, డిగ్రీలో చేరే విద్యార్థులు వెంటనే తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ కాపీలతో కళాశాలలో సంప్రదించాలని కోరారు. కళాశాలలో ఆన్లైన్ అడ్మిషన్స్ కోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు, దానికి కోఆర్డినేటర్లు గా డాక్టర్ ఆంజనేయులు,(9490196274) మరియు కె. మాలకొండయ్య,(9948775700) గార్లను నియమించినట్లు ఆయన వెల్లడించారు .

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *