ప్రజాశ్రేయస్సును విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఐ జిల్లా కార్యదర్శి యం ఎల్ నారాయణ

ప్రజాశ్రేయస్సును విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఐ జిల్లా కార్యదర్శి యం ఎల్ నారాయణ
22/10/20
ఎర్రగొండపాలెం అక్టోబర్ 23 న్యూస్ మేట్ :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాశ్రేయస్సును విస్మరిస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి యం యల్ నారాయణ అన్నారు. శుక్రవారం యర్రగొండపాలెం లోని సీపీఐ కార్యలయంలో సీపీఐ నియోజకవర్గ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ త్రిపురాంతకం మండల కార్యదర్శి బాణాల రామయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా యం ఎల్ నారాయణ మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రపంచం కుదేలయిందన్నారు. కేంద్రం ప్రభుత్వం కరోనా కారణంగా ప్రజలకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదన్నారు. మోదీకి ఎన్నికల్లో ఎవరైతే సాయం చేశారో వారు కోటీశ్వరులు కావడానికి వారికి అనుకూలమైన చట్టాలు తీసుకురావటం చాలా దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో రైల్వే రంగాన్ని , విమానాశ్రయాన్ని, బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. నరేంద్ర మోడీ మతాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా వ్యాపారస్తులు ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. మన రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను అభివృద్ధి చేస్తున్నాడే తప్పా ఎక్కడ ఒక తట్ట మట్టి పోసిన పాపాన పోలేదన్నారు. అమరావతిని మూడు ముక్కలు చేయడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు పేదల భూములను లాక్కుంటున్నారని ఆయన విమర్శించారు. మన రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు పేదల భూములను తక్కువ ధరలకు కొని ప్రభుత్వానికి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించి వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతాడని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ సీనియర్ నాయకులు టిసీఎచ్ చెన్నయ్య, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కర్యవర్గ సభ్యులు కేవి కృష్ణ గౌడ్ ,సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి జి.గురునాధం ,ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు ఎస్కే రహిమాన్, సీపీఐ దోర్నాల మండల కార్యదర్శి తిరుమలయ్య , యర్రగొండపాలెం మండల కార్యదర్శి గురవయ్య , ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు గుంటూరు శ్రీను , సీపీఐ నాయకులు నాగేశ్వరరావు కె.ఆదినారాయణ, ఎస్కె కాశీం, యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *