రామాయపట్నం అనుసంధానంగా అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చేయాలి సిపిఎం డిమాండు

రామాయపట్నం అనుసంధానంగా అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చేయాలి సిపిఎం డిమాండు22/10/20
గుడ్లూరు అక్టోబర్ 23 న్యూస్ మేట్ : ప్రవేట్ భాగస్వామ్యం తో నిర్మి స్తున్న రామాయ పట్నం మినీ పోర్టు పరిధిలో నే అన్నీ అనుబంధ పరిశ్రమలు, ఏర్పాటు చేసి, ప్రకాశంస జిల్లా ను అభివృద్ధి చేయాలని సిపిఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండు చేసింది. నెల్లూరు జిల్లాకు తరలిం చే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసి , ఈ జిల్లా అభివృద్ధి కి తోడ్పడాలని జిల్లా ప్రజా ప్రతిని దులకు సిపిఎం విజ్ఞప్తి చేసింది. బుదవారం నాడు ప్రభుత్వం వారు నిర్వహించిన నిర్వాసితుల సమావేశం ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించడంలో వారి ఆస్తులకు భరోసా కల్పించ లేక పోయిందని సిపిఎం పేర్కొంది. ప్రభుత్వం చొరవ తీసుకుని అధికారులు, ప్రజా ప్రతిని ధులు నిర్వాసితుల ప్రజలు వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులతో ఒక అధికారిక కమిటీ ఏర్పాటు చేసి నిర్వాసితుల పునరావాస గ్రామాలు ఏర్పాటుకు మరియు నష్టపోయిన రైతులకు కూలీలకు మత్య కారులకు మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేస్తుంది.నిర్వాసితుల లో నెలకొన్న భయాందోళనలు తొలగి పోవాలంటే వారికి సరైన వసతులు కల్పించి మెరుగైన నష్టపరిహారం ముందుగానే వంటైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కారం చేసి పని ప్రారంభించాలని సీపీఎం డిమాండు చేస్తుంది. నిర్వాసిత కుటుం బం లోఒకరికి ఉద్యోగం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని నిర్వాసి తులు అడిగిన ప్రాంతంలో మెరుగైన నివాస గృహాలు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని మెట్ట మాగాణి భూమి అనే తేడా లేకుండా అన్ని భూ ములకు నష్టపరిహారం చెల్లించాలని ఎక్కువ రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా దీనికి తోడు 5 రెట్లు అధికంగా ఉండే విధంగా నష్టపరిహారం ఇవ్వాలని పండ్ల తోట భూములకు ఆక్వా భూములకు 7.5 రెట్లు అధికంగా ధర చెల్లించాలని సీపీఎం డిమాండ్ చేస్తుంది. అసైన్మెంట్ భూముల అనుభవం లో 5 ఏకరాలు లోపు ఉన్న పేద కుటుంబాలకు హక్కు కల్పించాలి. చుక్కల భూములకు ఆర్ ఓ హెచ్ ప్రకారం సుమో టా గా రైతులకు హక్కు కల్పించాలి. ఇండ్లు కోల్పోయిన వారికి ఆర్ ఆర్ ప్యాకేజీ ప్రకారం అన్ని బెనిఫిట్స్ నిర్వాసితులకు చెందాలి. వీటితో పాటు,5 సెంట్లు ఇండ్ల స్థ లం, ఇండ్లు కట్టుకోవడానికి10 లక్షలు మంజూరు చేయాలి.ప్రతి కుటుంబానికి ఉచితంగా పాడి గేదెలు మేకలు గొర్రెలు ఉచితంగా పంపిణీ చేయాలి. కర్లపాలెం అవులవారిపాలెం మొండి వారిపలెం పల్లేకారులకు వారి వృత్తికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మెరుగైన వసతులు ఆ క్వా భూములకు మెరుగైన నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, సీపీఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జివిబి కుమార్, ప్రాంతీయ కమిటీ నాయకులు, నూతల పాటి, వెంకటేశ్వర్లు,మద్ది శెట్టి, జాల య్యీ. మాదాల రమణయ్య, ఇరువురి బ్రహ్మయ్య, పిచ్చయ్య. రామయ్య. పొట్లుర్, రవి. పొన్నం రా మ లక్ష్మమ్మ రామారావు భాస్కరరావు. దా మా కృష్ణయ్య. ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *