పేదోడి సొంతింటి కల నెరవేర్చాలి పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలి ఉచిత ఇళ్ల హామీని నిలబెట్టుకోవాలి సిపిఐ డిమాండ్

పేదోడి సొంతింటి కల నెరవేర్చాలి
పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలి
ఉచిత ఇళ్ల హామీని నిలబెట్టుకోవాలి సిపిఐ డిమాండ్

కనిగిరి అక్టోబర్ 23( న్యూస్ మేట్) : 22/10/20టి డ్కో పూర్తి చేసిన జి ప్లస్ త్రీ ఇళ్లను సత్వరమే లబ్ధిదారులకు ప్రభుత్వం అప్పగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ అన్నారు . శుక్రవారం కనిగిరి దర్శి చెంచయ్య భవన్లో సిపిఐ కనిగిరి మండల సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం సయ్యద్ యాసీన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎం ఎల్ నారాయణ మాట్లాడుతూ పేదలు అప్పులు చేసి ఇళ్లను పొందటానికి వాటాదనం చెల్లించారని, ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకు రుణం కూడా తీసుకున్నారని వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో బ్యాంకు వడ్డీలు కట్టలేక ఇళ్లను అమ్ముకునే దుస్థితి లబ్ధిదారులకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పంతంతో పూర్తయిన ఇల్లు స్వాధీనం చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు . 90 శాతం పూర్తయిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించకుండా వారి సొంత ఇంటి కల పై నీళ్లు చల్లింది . లబ్ధిదారులకు అప్పగించకుండానే శిథిలావస్థకు చేరుకుని పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు. సంవత్సర కాలం నుండి వాయిదాలు వేస్తూ వస్తూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉండలేక వేలాది రూపాయలు అప్పులు చెల్లించలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల కు సంబంధించి బ్యాంకు రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని కానీ పూర్తయిన ఇల్లు ఇంతవరకూ పంపిణీ చేయలేదన్నారు. కనిగిరి చాకిరాల వద్ద నిర్మించిన 912 మంది ఇళ్ల లబ్దిదారులకు జాబితాను ఈనెల 26 నుంచి 31 వరకు సేకరించి టెక్కో ఇళ్ల సాధన సమితి ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్ల లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిపిఐ ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి పూర్తిస్థాయి మద్దతు తెలపాలని కోరారు.ప్రభుత్వం స్పందించకపోతే నవంబర్ 16వ తేదీన ఇళ్లను లబ్ధిదారులు స్వాధీనం చేసుకొని వాటిలోనే నివాసం ఉండేలా సిపిఐ పార్టీ చొరవ చూపుతుందన్నారు. ఈ క్రమంలో పార్టీ నాయకులు సమాయత్తం కావాలన్నారు. అక్టోబర్ 31వ తేదీన జరిగే ఏఐటియుసి శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగటానికి అందరూ చొరవ చూపాలన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ ఉన్నతికి అందరు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు మాట్లాడుతూ టిడ్కో పూర్తిచేసిన ఇళ్లను స్వాధీనం చేసుకోవడానికి సమావేశమవుతుందని శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. స్థానిక ఎన్నికలకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బృంగి సుబ్రమణ్యం, కనిగిరి మండల కార్యదర్శి జి పి రామారావు, ఎన్ టి యు సి జిల్లా నాయకులు గుజ్జుల బాల్రెడ్డి, కనిగిరి కార్యదర్శి ఎస్కే ఎం పీరా ,షేక్ షరీఫ్, స్టాలిన్ ,మీ రావాలి ,పుట్టసుబ్బారావు ,రాములు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *