సజ్జల కొనుగోలు కేంద్రాన్ని రైతుల సద్వినియోగ పరచుకోవాలి ఏ పి ఎం
పొదిలి అక్టోబర్ 23 న్యూస్ మేట్ : రైతులు రైతు భరోసా కేంద్రం లో ప్రారంభించిన సజ్జల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం మాణిక్యాలరావు కోరారు. శుక్రవారం పొదిలి మండలం కుంచ పల్లె గ్రామంలో సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రోద్బలముతో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు .ఈ కార్యక్రమంలో పేరం నాగిరెడ్డి సుభాష్ చంద్ర బోస్ కే నారాయణ రెడ్డి శ్రీను వెంకటేశ్వర్ రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు.