పట్టాభిరామ్ మూర్తి అబ్దుల్ సత్తార్ కుటుంబాలను పరామర్శించిన నూకసాని బాలాజీ

పట్టాభిరామ్ మూర్తి అబ్దుల్ సత్తార్ కుటుంబాలను పరామర్శించిన నూకసాని బాలాజీ
లింగసముద్రం అక్టోబర్ 23 న్యూస్ మేట్: – మండలంలోని పెద్దపవని గ్రామంలో ఇటీవల మృతి చెందిన టిడిపి సీనియర్ నాయకులు పట్టాభిరామ్ మూర్తి మరియు సయ్యద్ అబ్దుల్ సత్తార్ కుటుంబ సభ్యులను ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ శుక్రవారం పరామర్శించారు. పట్టాభిరామ్ మూర్తి కోడలు మాజీ ఎంపీపీ కల్పనను అబ్దుల్ సత్తార్ కుమారుడు నాయబ్ రసూల్ ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు .వారి మరణం మండల టిడిపికి తీరనిలోటని తెలియజేశారు. అలాగే వారి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని తెలియజేశారు. టిడిపి కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు అని బాలాజీ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.మండల టిడిపి కార్యకర్తలను వేధిస్తున్నారని సమస్య తన వరకు వచ్చిందని పార్టీ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని తెలియజేశారు. గతంలో వివిధ పనులు చేసిన టిడిపి వారికి రావలసిన బకాయిలను రాకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. వైసీపీ కి అధికారం ఇచ్చింది టీడీపీ కార్యకర్తలను వేధించడానికి కాదని వారి మీద అక్రమ కేసులు బనాయించడానికి కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో గని పి నేని నరసింహారావు బి శ్రీనివాసులు గొల్లపల్లి వెంకటేశ్వర్లు షేక్ బాబు చిట్టబోయిన ప్రసాదు సుబ్బులు నాయుడు మొదలైన వారు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *