రైతు భరోసా కేంద్రం- రైతుకు ధీమా.

రైతు భరోసా కేంద్రం- రైతుకు ధీమా.

వలేటివారిపాలెం సెప్టెంబర్ 23 న్యూస్ మేట్ : 22/10/20పంట పెట్టుబడికి అధిక వడ్డీలకు తీసుకుంటున్న రైతుకు సాయం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టుబడి సాయం కింద 13,500 రూపాయలు అందిస్తున్నారని స్థానిక శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు.కొండసముద్రం రైతు భరోసా కేంద్రం లో సబ్సిడీపై సెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి శుక్రవారం రైతులకు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భూమిలో విత్తనం వేసిన మొదటి నుంచి ఆధునిక యంత్రాల అద్యప్రాతిపదిక పై కల్పిస్తున్న పెట్టుబడి సాయం తో పాటు గిట్టుబాటు ధర లేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజల ముంగిటకు 500 సేవలకు పైగానే సచివాలయ వ్యవస్థ ద్వారానే అందజేస్తుందని అన్నారు. పంటల సాగులో రైతు పెట్టుబడిని తగ్గించేందుకు కూలీల డిమాండ్ దృష్ట్యా అత్యాధునిక యంత్ర పరికరాలను రు 1.5 కోట్లు విలువచేసే యంత్రాలను మండల కేంధ్రాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.ప్రతి రైతు భరోసా కేద్రం లో అతి తక్కువ అద్దె కు ఆధునిక యంత్ర పనిముట్లను రైతు గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ యాంత్రీకరణ పనిముట్లకు ఎంపిక చేసిన రైతు గ్రూపుకు 10 శాతం రైతు గ్రూప్ చెల్లిస్తే 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుండగా మరొక 50 శాతం బ్యాంకు రుణం కింద అందజేస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా తక్కువ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాల ద్వారా పంట కొనుగోలును చేస్తుందని అన్నారు. పాదయాత్రలో రైతు ఇచ్చిన హామీల మేరకు రైతు ధర స్థిరీకారణ ఏర్పాటు చేసిందని చెప్పారు. గత మూడేళ్లుగా శనగలకు గిట్టుబాటు ధర రాక నిల్వలు ఉండగా ఈ ఏడాది మార్క్ సెడ్ ద్వారా కొనుగోలు చేసిందని చెప్పారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జెడ్ యాన్ బి కార్యక్రమం కింద కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల రైతులకు నేటికి అవగాహన కల్పించకపోవడం సోసనీయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం కింద చేర్చడానికి కసరత్తును చేస్తుందని అన్నారు.ప్రతి రైతు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కలిగి పంటల సాగు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమం లో ఏబీఎ శేషగిరి రావు,తహసీల్దార్ ముజఫర్ రెహమాన్,ఎంపిడివో రఫీక్ అహ్మద్,ఎఎంసి చైర్మన్ గణేశం శిరీష గంగిరెడ్డి,ఆర్ ఐ ప్రసాద్,వైస్ చైర్మన్ మేకనబోయిన శ్రీనివాసులు,ఎస్సై చావా హజరత్తయ్య,వైసీపీ నాయకులు మన్నం వెంకట రమేష్, అనుమోలు లక్ష్మీనరసింహ, నల్లమోతు హరిబాబు, వడ్లమూడి రమేష్, వీరాస్వామి, వేణుగోపాల రెడ్డి, సంజీవరెడ్డి, ఆత్తోటి చెన్నయ్య, వెంకటేశ్వర్లు ( వై యస్ ), దివి వీరయ్య, కట్టా హనుమంతరావు, గుత్తా గోపి, అనుమోలు వెంకటేశ్వర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ హరిబాబు, సచివాలయ సిబ్బంది,వలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *