పొదిలి భూ బకాసురుడు భూ కబ్జాలపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని తహసీల్దార్ ను కోరిన వివిధ రాజకీయ పక్షాల నేతలు

పొదిలి భూ బకాసురుడు భూ కబ్జాలపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని తహసీల్దార్ ను కోరిన వివిధ రాజకీయ పక్షాల నేతలు
పొదిలి అక్టోబర్ 23 న్యూస్ మేట్ : 22/10/20పొదిలి లో చిన్న చెరువు పెద్ద చెరువు, అలుగు పోరంబోకు పంట కాలువలు ముగ్గు రాళ్లవాగు, తలమడుగు, వెంగమ్మ మడుగు,స్మశానాలు, బందెలదొడ్డి, మహిళ మరుగుదొడ్లు,బావులు, దారులు, అసైన్డ్ భూములు, పేద ప్రజల సాగు చేసుకునే వ్యవసాయ భూములు, సుమారు 125 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసి ఇలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు, ఇండ్లు , ఇళ్ల స్థలాలు, ఎస్టేట్లు ఏర్పాటుచేసి తద్వారా పొదిలిలో నీటి సమస్యను తీవ్ర రూపం దాల్చే ఎందుకు పాటుపడిన పొదిలి భూ బకాసురుడు ఎలిశెట్టి వెంకటేశ్వర్లు భూ కబ్జాలపై త్వరిత గతిన విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని, భూ బకాసురుల పై పీడీ యాక్ట్ అమలు పరిచి కఠినంగా శిక్షించాలని అఖిలపక్ష కమిటీ నాయకులు తాసిల్దార్ని శుక్రవారం కోరారు. ఆ మేరకు అఖిలపక్ష నాయకులు తాసిల్దార్ ని కలిసి భూకబ్జాలకు సంబంధించిన వివరాలు వివరించారు ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి, మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ షేక్ సైదా, సిపిఎం పొదిలి ఏరియా కార్యదర్శి కె రమేష్, సిపిఐ పొదిలి పట్టణ కార్యదర్శి, కె.వి రత్నం బిజెపి నాయకులు, మాకినేని అమర సింహ, లోక్ జనశక్తి జిల్లా అధ్యక్షులు, కొండ ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు కొట్టు వరప్రసాద్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *