నివర్ తుఫాను భాదిత రైతులకు నష్టరిహారం చెల్లించాలి – ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా కోశాధికారి పి. వి.నారాయణమ్మ
పొదిలి డిసెంబర్ 1 న్యూస్ మేట్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో నివర్ తుఫాను వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయం లో తహశీల్దార్ పి.వి.హనుమంతరావు కు అఖిల భారత యువజన సమాఖ్య (ఏ.ఐ.వై.ఎఫ్) జిల్లా కోశాధికారి పొలూరి వీర నారాయణమ్మ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలం లో ఉన్న పలు గ్రామాల్లో రైతాంగం సాగు చేస్తున్న కంది, వరి, మినుము, మిర్చి, బొబ్బర్లు, పత్తి, పొగాకు తదితర పంటలు కోతకు వచ్చి, పంట చేతికి వచ్చేదశలో వర్షాల కారణంగా దెబ్బతిని పనికిరాకుండా పోయాయని తెలిపారు. రైతులకు పెట్టుబడులు కూడా చేతికి రాక ఆర్ధికంగా నష్టపోయారన్నారు. ఈ విషయం పై రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మండలంలోని గ్రామాలల్లో పంట నష్టాన్ని అంచనా వేసి నష్టం జరిగిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని, రైతులందరిని ప్రభుత్వం ఆదుకోవాలని, తిరిగి మళ్ళి పంటలు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలను పంపిణీ చేయాలని ఆమె కోరారు. రైతులకు నష్ట పరిహారం ఇచ్చెంతవరకు ఏ.ఐ.వై.ఎఫ్ రైతుల పక్షాన నిలబదుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల ఏ.ఐ.వై.ఎఫ్ నాయకులు పాల్గొన్నారు