IFC foundation ఆద్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
కందుకూరు డిసెంబర్ 1 న్యూస్ మేట్ :-ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలు, వితంతువులకు మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి జిల్లా పరిషత్ బాలుర హైస్కూలు ఉపాధ్యాయులు బండి గోవిందయ్య , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షులు షేక్.రషీద్ ముఖ్య అతిదులుగా పాల్గొని మాట్లాడుతూ ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ వారు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు పేదవారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండ గా నిలుస్తూ ఈ సంస్థ ముందుకుపోవాలని వారు అన్నారు. సంస్థ కార్యదర్శి షంశీర్ మాట్లాడుతూ సంవత్సరం నుండి ప్రతి నెల ఒకటో వ తారీఖున 15 మంది నిరుపేదలను, వితంతువులకు ఇంటికి సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ రహీమ్, హఫీజ్, కొచ్చెర్ల మాల్యాద్రి, పాల్గొన్నారు.