అంగన్వాడీ కార్యకర్త ,ఆయా నిర్లక్ష్యం.. మురిగిపోయిన కోడిగుడ్లు
కనిగిరి డిసెంబర్ 1 (న్యూస్ మేట్ ) :అంగన్వాడీ కార్యకర్త నిర్లక్ష్యం కారణంగా నిరుపేద గర్భిణీలకు అందవలసిన కోడిగుడ్లు మురిగిపోయే కంపు కొడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతుంటే అధికారులు కిందిస్థాయి ఉద్యోగస్తుల నిర్లక్ష్యంతో పథకాల లక్ష్యం నీరుకారిపోతుంది. ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తో పాటు లబ్ధిదారులకు ప్రయోజనం కలగడం లేదు రాష్ట్ర ప్రభుత్వం పేద గర్భిణీ బాలింతలు చంటి బిడ్డలకు పౌష్టికాహారం కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందించవలసిన పదార్థాలు అంగన్వాడీ కార్యకర్త నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులకు అందడం లేదు .ప్రకాశం జిల్లా కనిగిరిలో నగర పంచాయతీలోని కాశి రెడ్డి కాలనీ లోని అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందించిన సుమారు 400 పైగా కోడిగుడ్లు మురిగిపోయి పురుగు పట్టి దర్శనమిచ్చాయి.అయితే మంగళవారం సిడిపిఓ సెంటర్ ను సందర్శించిన సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది .అంగన్వాడీ కార్యకర్త కు ఫోన్ చేసి వివరణ అడగ్గా తాను జ్వరంతో ఉండడం వల్ల రాలేకపోయానని చెప్పింది. అదే విధంగా అంగన్వాడీ ఆయా తనకు అంగన్వాడీ కార్యకర్త చెప్పకపోవడంతో పంపిణీ చేయలేదని తెలియజేసింది. ఈ విషయంపై మాట్లాడుతూ ఆరు నెలలకు ఒకసారి పంపిణీ చేస్తూ ఉంటారని కొందరికి ఇచ్చి అందరికీ ఇచ్చినట్టు రాసుకుంటారని మురిగిపోయిన గుడ్లు పాడైపోయిన పాలు మాకు ఇస్తున్నారన్నారు . ప్రభుత్వం నుంచి అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన సరుకులు అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసి ఉండటంతో తిరిగి వెళ్లిపోతుంటారు అని కేంద్రం తెరిచి ఉన్న సమయంలో వస్తే వారు ఎవరూ లేరని పంపిస్తూ ఉంటారని అన్నారు . తాము నిరుపేద మహిళల మని తమ పిల్లలు పోషకాహారలోపం తో పుట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తమ లాంటి వారి కోసం ఉచితంగా ఇస్తున్న ఇటువంటి పదార్థాలను కూడా తమకు చేరనివ్వకుండా తమకు అన్యాయం చేస్తున్నారని వారు వాపోయారు. వస్తువులు పంపిణీ చేయమని నిలదీస్తే ఇష్టానుసారంగా పంపిణీ చేస్తున్నారని ఇదేమని అడిగితే మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అంటూ బదులిస్తూ ఉంటారని తెలియజేశారు. ముఖ్యంగా బాలింతలు తీవ్ర బలహీనత తో ఉంటారు .కానీ ఇక్కడ అంగన్వాడీ వర్కర్లు నిర్వాకంతో వారు మరి కృశించి పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుకుతున్నారు.
సిబ్బంది నిర్లక్ష్యంపై
సి డి పి ఓ లక్ష్మీ ప్రసన్న వివరణ ఇస్తూ వర్కర్ కి మెమో జారీ చేస్తున్నామని అదేవిధంగా అయాకు జీతం నిలుపుదలకు చేస్తున్నామని తెలియజేశారు.