ప్రకాశం జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి.. ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి
ఒంగోలు డిసెంబర్ 1 న్యూస్ మేట్ : స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి సేవలు ప్రకాశం జిల్లా ప్రజానీకం గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి అని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. మాగుంట సుబ్బరామరెడ్డి 25 వ వర్ధంతి సందర్భంగా రాంనగర్ 2 వ లైనులోని మాగుంట కార్యాలయంలో, అభిలాష్ హోటల్ సెంటర్,రైల్వే స్టేషన్ రోడ్డులో ,స్టేట్ బ్యాంక్ సెంటర్, అద్దంకి బస్టాండు సెంటర్ లో మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహాలకి పుష్పమాలంకరణ చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాని ఎన్నటికీ మరచి పోదని అన్నారు .సుబ్బరామిరెడ్డి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారని ఆయన గుర్తు చేశారు. ఆయన గుర్తుగా చిరకాలం ప్రజల హృదయాల్లో నిలిచి ఉండే కార్యక్రమాలు కొనసాగిస్తూ ఆయన వదిలి వెళ్లిన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మాగుంట రాఘవ రెడ్డి శ్రీమతి మాగుంట చందనమ్మ జిల్లా ఎస్ పి సిద్ధార్ద్ కౌశల్ దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి శాసనమండలి సభ్యులు పోతుల సునీత మరియు నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.