పూజారుల పై వైకాపా నాయకుడు దాడి హేయమైన చర్య – కాంగ్రెస్ నేత సైదా
మార్కాపురం డిసెంబర్ 1 న్యూస్ మేట్ : కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార దేవస్థానం” పూజారుల పై వైకాపా నాయకుడు ఆలయ పాలకమండలి చైర్మన్ పిట్ట0 ప్రతాపరెడ్డి చర్నాకోల తో పశువులను కొట్టినట్లు కొట్టి అనాగరికంగా హింసించడం హేయమైన చర్య అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ షేక్ సైదా తీవ్రంగా ఖండించారు .పవిత్రమైన కార్తీకమాసంలో కార్తీక పౌర్ణమి రోజున నిత్యం దైవ సన్నిధిలో పూజలు నిర్వహించే దైవ సంభూతు లైనా పూజారులను చర్నాకోల తో దైవ సన్నిధిలో వా తలు వచ్చేటట్టు దారుణంగా కొట్టి భయబ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదని ప్రాణభీతితో దెబ్బలకు తట్టుకోలేక పారిపోతున్న పూజారి ఆయన కుమారులను ప్రతాప్ రెడ్డి అనుచరులు కర్రలతో వెంబడించి దారుణంగా కొట్టడం అలాగే భయంతో గుడిలోకి వెళ్లి తాళం వేసుకున్న వారిని సైతం, బయటకు ఈ డ్చుకుని వచ్చి కొట్టడం లాంటి చర్యలకు పాల్పడిన ఇలాంటి నరరూప రాక్షసుడైన వ్యక్తి ఆలయ పాలక మండలి చైర్మన్ పదవికి అనర్హుడని అతనిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించడం తో పాటు అతని పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సైదా కోరారు.రాష్ట్రంలో 18 నెలల వైకాపా పాలనలో బడుగు బలహీన వర్గాలు, దళితులు, ముస్లిం మైనారిటీ లు,మహిళ లు, రైతులు మీద దాడులు హింసాత్మక సంఘటనలు నిత్యకృత్యమయ్యాయ నీ , చివరకునిత్యం దైవ సన్నిధిలో ఉండే పూజారులు, మౌ జనులు, పాస్టర్ ల మీద కూడా దాడికి దిగడం వైకాపా రాక్షస పాలన కు పరాకాష్ట అని సైదాఅన్నారు.ఇలాంటి దారుణమైన ఘటన ల కు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర హోమ్ శాఖామాత్యులు సుచరిత, దేవాదాయ శాఖ మాత్యులు శ్రీనివాసరావు, మైనారిటీ శాఖ మాత్యులు అంజాద్ బాషా తమ తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, లేనిపక్షంలో ఈ పవిత్ర కార్తీకమాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు, మసీదులు, ప్రార్థన మందిరాలు చెందిన పూజారులు, మౌ జనులు, పాస్టర్ ల తో కలిసి సంయుక్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తుందని సైదా హెచ్చరించారు.