సమాజం నుండి ఎడిషన్ తరిమేద్దాం ఎంపీడీవో
పామూరు డిసెంబర్ 1 (న్యూస్ మేట్) : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్. పి. రాజశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల ప్రజపరిషత్ అభివృద్ధి అధికారి మంచికంటి. రంగ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష చూపరాదని ప్రేమ స్నేహ భావంతో మెలగాలని సూచించారు ఎయిడ్స్ వ్యాధి మందుల ద్వారా పూర్తిగా నయమవుతుందని, అనుమానం వున్న ప్రతిఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎయిడ్స్ పరీక్షలు చేయించుకుని సరైన సమయంలో మందులు వాడితే సంపూర్ణంగా నయం అవుతుందని సూచించారు. కలుషిత రక్తం ద్వారా, విచ్చలవిడి శంగారం వలన ఈ వ్యాధి ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపిస్తుందనీ, వివాహేతర లైంగిక సంబధాలను కలిగి వుండుట వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది, కరచాలనం వలన, దోమల ద్వారా ఈ వ్యాధి వ్యాపించదని తెలియచేశారు. అలాగే మండల పరిధిలోని బొట్లగూడూరు గ్రామంలో ప్రభుత్వ వైద్య అధికారిని డా. సాయి పద్మ ప్రశాంతి మెడికల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మురళీకృష్ణ, హరి, లాబ్ టెక్నీషియన్ భాష,ఏఎన్ఎంలు, ఆశ వర్కర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.