సమాజ అవగాహన తోనే ఎయిడ్స్ నిర్మూలన —సి డి పి ఓ లక్ష్మీప్రసన్న

సమాజ అవగాహన తోనే ఎయిడ్స్ నిర్మూలన —సి డి పి ఓ లక్ష్మీప్రసన్న
కనిగిరి డిసెంబర్ 1 (న్యూస్ మేట్ ) : 01/12/20సమాజ మార్పు తోనే ఎయిడ్స్ నిర్మూలించ బడుతుంది అని సి.డి.పి.ఓ లక్ష్మీప్రసన్న అన్నారు.డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని మంగళ వారం కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని ఏడవ సచివాలయంలో న్యాయసేవాధికార సంస్థ , ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, గుడ్ హెల్ప్ సంస్థ, రెడ్ క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ప్రజలు ఎయిడ్స్ రోగులను తాకడానికి భయపడుతుండేవారు, సమాజంలో వారిని వెలి వేసిన వారిగా వారు వింతగా కనిపిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన పెంచడం ప్రారంభించిన తర్వాత, ఎయిడ్స్ రోగులు సాధారణ ప్రజలలా జీవించగలుగుతున్నారని వారిని ముట్టుకోవడం ద్వారా, వారితో మాట్లాడటం వల్ల ఎయిడ్స్‌ వ్యాపించదని తల్లికి హెచ్‌ఐవి ఉంటే, శిశువు ప్రసవంతో, తల్లి పాలివ్వడంతో వస్తుందనేది అబద్దం అని ఆమె అన్నారు.కానీ ఇది తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి వ్యాప్తిని నిరోధించగలదు. తల్లికి హెచ్‌ఐవి మరియు తగిన చికిత్స ఉంటే గర్భధారణ సమయంలో ప్రారంభ హెచ్‌ఐవి పరీక్షను నివారించవచ్చు. గర్భధారణ సమయంలో ఒక ఇంజెక్షన్ శిశువును హెచ్ఐవి ప్రమాదం నుండి కాపాడుతుందని ఆమె చెప్పారు . కె ఎస్ ఎమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూఎయిడ్స్ నిర్మూలనలో సమాజం యొక్క పాత్ర ఎంతో ముఖ్యమని 2020లో ఎయిడ్స్ అవగాహన యొక్క అంశం ‘సమాజ మార్పు’ తీసుకురావడం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐ సి టి సి కౌన్సిలర్ శ్రీనివాసరావు సచివాలయ అడ్మిన్ సునీల్, పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ సంస్థ కార్యదర్శి మండ్రు రమేష్ బాబు, పారా లీగల్ వాలంటీర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ గంధం సామ్యేల్ గేర్షోమ్ , మల్లికార్జున, పి టి ఎల్ ఏ జిల్లా కార్యదర్శి విజయకుమార్, ప్రధానోపాధ్యాయులు బాల సుబ్బారెడ్డి, ప్రసాద్ రెడ్డి సచివాలయం ఏఎన్ఎం లక్ష్మి, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *