సమాజం మధ్య నుండి ఎయిడ్స్ తరిమేద్దాం ఎంపీ శ్రీనివాసులురెడ్డి
ఒంగోలు డిసెంబర్ 1 న్యూస్ మేట్ : ఎయిడ్స్ మహమ్మారిని సమాజం నుండి దూరంగా తరిమివేయాలని అందుకు ప్రతి పౌరుడు సమాజంలో చైతన్యం కలిగించాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు .ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒంగోలు లో ఎయిడ్స్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకానొకనాడు ఎయిడ్స్ సమాజాన్ని భయాందోళనలకు గురి చేసిందని ఈనాడు ఎయిడ్స్ కి తగిన మందులు వచ్చినందున ఎయిడ్స్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎయిడ్స్ కు దూరంగా ఉండటం ఉత్తమ లక్షణం అని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ సమాజంలో ఎయిడ్స్ రోగుల పట్ల చులకన భావన తొలగిపోవాలని ఆయన కోరారు .ఎయిడ్స్ బాధితులను ఆప్యాయంగా పలకరించాలని గౌరవించాలని ఆయన సూచించారు .ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డి e జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట మురళి ఇతర అధికారులు పాల్గొన్నారు.