ఈ – క్రాప్ తో సంబంధం లేకుండా రైతులకి పూర్తిగా నష్టపరిహారం అందించాలి. టిడ్కో లబ్ధిదారులకు గృహాలను ఎటువంటి షరతులు లేకుండా ఉచితంగా అందించాలి. పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ

ఒంగోలు డిసెంబరు 1 న్యూస్ మేట్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులును ఇష్టారీతిగా శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం అత్యంత హేయమైన చర్య అని దీనిని ఖండిస్తున్నామని ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. రైతు సమస్యలపై మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు సమయం అడిగితే దానికి విరుద్ధం గా, అప్రజాస్వామిక పద్దతిలో చంద్రబాబు తో సహా టీడీపీ శాసనసభ్యులను సస్పెండ్ చేయడం సరికాదని అన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబు నాయుడు శాసనసభలో స్పీకర్ పోడియం వద్ద కూర్చునే విధంగా వ్యవహరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఆక్షేపణీయం అని ఆయన అన్నారు. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి శాసనసభలో చర్చ చేయాలని చంద్రబాబు నాయుడు పట్టు పట్టడం దానికి ఆయన మాట్లాడకుండా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ముఖ్యమంత్రి చెపితే ఆయన ఆజ్ఞ లను పాటిస్తూ చంద్రబాబు నాయుడు ని మాట్లాడనీయకుండా చేయడం తగునా అని ప్రశ్నించారు. ఈ- క్రాప్ లో ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే రైతుల పేర్లు నమోదయ్యాయని, అలా కాకుండా నిరవ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులు అందరికీ ఈ- క్రాప్ విధానంతో సంబంధం లేకుండా, దాదాపు రెండు లక్షల హెక్టార్లలో జరిగినటువంటి పంట నష్టాన్ని రైతులందరికీ బేషరతుగా నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు నాయుడు అన్నారని మీరు ప్రచారం చేయబోయి మీరు అభాసుపాలు అయ్యారని, రైతులును మోసం చేయడం తగదని హితవు పలికారు. టిడ్కో గృహాలలో కేవలం 10 శాతం ఉన్న 300 చదరపు అడుగుల గృహాలను ఉచితంగా ఇస్తామని చెప్పడం అత్యంత దుర్మార్గమని, ఎన్నికల ప్రచారంలో అన్ని గ్రహాలు ఉచితంగా ఇస్తామని ప్రకటించి, కేవలం 10 శాతం ఉన్న 300 చదరపు అడుగుల గృహాలు ఇస్తామనడం మాట తప్పడం, మడమ తిప్పడం కాక మరేంటని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు కట్టించిన టిడ్కో గృహాలలో 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల గృహాలను సైతం ఉచితంగానే అందించాలని, లబ్ధిదారులకు బేషరతుగా వాటిని అందించాలని తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *