వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పోస్టర్ లు పంపిణీ
దుత్తలూరు డిసెంబర్ 1 న్యూస్ మేట్:- దుత్తలూరు ప్రాధమిక వైద్యశాలలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పోస్టర్ లను వైద్యాధికారి వీరేంద్రకుమార్ ఆవిష్కరణ చేశారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాలలో ఈ పోస్టర్ లను ఉంచాలని తెలిపారు .సచివాలయ పరిధిలోని పేషంట్ లు ఎవరైనా నెట్ వర్క్ హాస్పటల్ కి వెళ్ళాలంటే పిహెచ్ సి నుండి రెఫరల్ తీసుకొవ్వాలని తెలిపారు .ఎమర్జెన్సీ పేషంట్ లు నేరుగా నెట్ వర్క్ హాస్పటల్ కి ఆరోగ్యశ్రీ కార్డు ,ఆధార్ కార్డు తీసుకొని వెళ్లవచ్చునని తెలిపారు .ఈ కార్యక్రమం లో సిహెచ్ ఓ గంగరాజు ,సూపర్ వైజర్ జగన్ మోహన్ ,హెచ్ వి అరుణ కుమారి ,ఆరోగ్యమిత్ర కె .చంద్ర ,సచివాలయ ఏఎన్ ఎం లు ,ఆశా వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా సందర్బంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.