వలంటీర్లకు దరఖాస్తుల స్వీకరణ.
వలేటివారిపాలెం డిసెంబర్ 2 న్యూస్ మేట్ : మండలంలో ఖాళీగా ఉన్న వలంటీర్ల పోస్టులకు అర్హులైన నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో రఫిక్ అహ్మద్ చెప్పారు. మండలంలోని నలదలపూర్ జనరల్ 1, బీసీ మహిళ 1, నేకునాంపురం బీసీ జనరల్ వలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈనెల 5వ తేదీ లోపు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు అందజేయాలని ఆయన కోరారు.