నివర్ తుఫాన్ బాధితులకు కావలి బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపణి
కావలి, డిసెంబర్ 2,(న్యూస్ మేట్) : కావలి మున్సిపాలిటీ పరిధిలోని బుడుగుంట గిరిజన కాలనీ లో నివర్ తుఫాన్ బాధితులకు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సహాయక చర్యల్లో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు , దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కావలి బిజెపి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ ఇక్కడ స్థానికంగా గిరిజనులు చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని , వారికి సరైన వసతులు లేవని, వారు నివసించే ప్రాంతంలో రోడ్లు లేవు అని ,వీధి లైట్లు లేవు అని, తాగునీటి వసతి లేదని ,వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, నివర్ తుఫాన్ వల్ల వారు చాలా నష్టపోయారని, తుఫాన్ ముగిసి నాలుగు రోజులైనా ఎటువంటి సహాయక చర్యలు అందలేదని, తక్షణమే ప్రభుత్వం బాధితులను గుర్తించి వారిని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అంచిపాక కమల మాట్లాడుతూ బుడమగుంట కాలనీ లో ఇన్ని సమస్యలు ఉన్న అధికారులు వారి సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు , జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మితమైన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయ కుండా కాలయాపన చేస్తోందని , ఈ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన సచవాలయా వాలంటరీ ఉద్యోగులకు , కావలి పట్టణానికి కేవలం కూతవేటు దూరంలో ఉన్న ఈ గిరిజన కాలనీ పరిస్థితి కనబడలేదా, అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ ప్రాంత గిరిజనులకు తగు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మొర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరుసు వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన మహిళా ప్రధాన కార్యదర్శి పాలడుగు సుభాషిని, పట్టణ ఉపాధ్యక్షులు కేసరి బాల మురళి ,పట్టణ కార్యదర్శులు మంద కిరణ్ కుమార్ ,సుందర్ శెట్టి సుజి, పట్టణ ఎస్ సి మోర్చా అధ్యక్షులు జలదంకి విజయ్ కుమార్ ,పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గుడాల శ్రీనివాసులు, పట్టణ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ ఖాదర్ భాష,పట్టణ నాయకులు మంద ప్రవీణ్ ,తిరుపతి సుధాకర్ ,మందా శ్రీనివాసులు, పున్నెపల్లి సింహద్రి, పట్టణ మహిళా నాయకులు ఉదయలక్ష్మి , అనిత , స్వప్న, విజయ కుమారి మరియు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.