వరద బాధితుల పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదు – ఎస్ మళ్లీ

వరద బాధితుల పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదు – ఎస్ మళ్లీ

02/12/20

బోగోలు, డిసెంబర్ 2, (న్యూస్ మేట్): ఇటీవల కురిసిన భారీవర్షాలు, తుఫానుల వల్ల బోగోలు మండలంలోని ఎస్సీ, ఎస్టీ గిరిజనుల కాలనీలలో నీరు చేరి పది రోజుల నుండి అన్నం వండుకోక అనేక ఇబ్బందులు పడుతున్నారని దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో బోగోలు మండల తహశీల్దార్ కి వినతిపత్రం సమర్పించారు. అనంతరం దళిత సంఘర్షణ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎస్ మళ్లీ మాట్లాడుతూ ఎక్కువగా అల్లిమడుగు, తెల్లగుంట, రామస్వామి పాలెం, యానాదుల కాలనీ, దళిత కాలనీ సిద్ధన పాలెం కాలనీలలో విపరీతంగా నీరు చేరి ఉన్నాయని కొందరు అయితే పది రోజుల నుండి అన్నం వండుకోక తినడానికి తిండి లేక నీరు లేక ఇబ్బందులు పడుతూ ఊర్లకు వెళ్తున్నారని. ఈ పరిస్థితులలో ప్రభుత్వం తక్షణమే ప్రతి వ్యక్తికి 500 రూపాయలు ఇస్తామని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ బడుగు బలహీన వర్గాలకు అందజేయలేదు అని బడుగు వర్గాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గతంలో ప్రభుత్వాలు వరదలు ప్రారంభమైనప్పటి నుంచి ఎంతో కొంత సాయం అందించే వారని ఇప్పుడు ఈ ప్రభుత్వం బియ్యం, ధనసాయం ఇంతవరకు చేయలేదన్నారు. ఇంత నిర్లక్ష్య ధోరణి లో ఈ ప్రభుత్వం వ్యవహరిచడం అన్యాయమని పంటలు నష్టమే కాకుండా అనేక పూరిల్లు వరదల్లో కొట్టుకుపోయాయని తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం 5 వేల నగదు ఇవ్వాలని కోరారు. అలాగే ఇస్తామన్నా 500 తక్షణమే ఇవ్వాలని అన్నారు మండలంలోని లోతట్టు గ్రామాలు ఇప్పటికీ నిలువెత్తు నీళ్లలో నిండి ఉన్నారు. పశువులు కోళ్లు అన్ని వరద పాలు అయ్యాయి .ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాలకొండయ్య, భాస్కర్, కె మాలకొండయ్య, మోహన్ రావు, ఆనందం, సలీం భాష, వెంకయ్య, సిహెచ్ వెంకయ్య, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *